For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  స్టార్ హీరో అజిత్ గుండెల్లో దడ పుట్టించిన వ్యక్తి.. మరికొన్ని గంటల్లో బాంబ్ బ్లాస్ట్ అనగానే...

  |

  కోలీవుడ్ స్టార్ హీరోల్లో అత్యధిక ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న వారి సంఖ్య కాస్త ఎక్కువగానే ఉంది. కమర్షియల్ స్టార్ హీరోలు ఎప్పటికప్పుడు ఒకరిని మించి మరొకరు బాక్సాఫీస్ హిట్స్ అందుకుంటూ ఉంటారు. అజిత్ గత కొంతకాలంగా వరుస బాక్సాఫీస్ హిట్స్ తో తన స్థాయిని అమాంతంగా పెంచుకున్నాడు. అయితే ఇటీవల ఒక వ్యక్తి కారణంగా అజిత్ గుండె ఆగిపోయినంత పనయ్యింది.

  ఫ్యాన్ సెల్‌ఫోన్‌ లాక్కున్న Ajith, Fanism హద్దు మీరుతొంది !
  ఎవ్వరు కూడా ఇబ్బంది పడకూడదని

  ఎవ్వరు కూడా ఇబ్బంది పడకూడదని

  అజిత్ వీలైనంత వరకు ప్రయివేట్ లైఫ్ ను ఎక్కువగా ఇష్టపడతారు. ఇండస్ట్రీలో ఈవెంట్స్ అయినా కూడా డిస్టెన్స్ మెయింటైన్ చేస్తుంటారు. ఇక వివాదాల జోలికి వెళ్లడం కూడా ఏ మాత్రం వెళ్లడు. తన వల్ల అభిమానులు ఎవ్వరు కూడా ఇబ్బంది పడకూడదని అజిత్ చాలా బలంగా కోరుకుంటాడు.

  సేఫ్ జోన్ లోనే

  సేఫ్ జోన్ లోనే

  అభిమానులను కూడా అజిత్ చాలా తక్కువగా కలుస్తూ ఉంటాడు. సినిమాల్లో మిగతా హీరోలలాగా ప్రభుత్వాలపై సెటైర్స్ వేయడం కావాలని సీన్స్ తో కౌంటర్ ఇచ్చే ప్రయత్నాలు కూడా చేయడు. సేఫ్ జోన్ లోనే నార్మల్ అడియెన్స్ ఎంజాయ్ చేసేలా పక్కా కమర్షియల్ సినిమాలు చేస్తుంటారు.

  చిన్నప్పటి ప్రయోగం తప్పితే

  చిన్నప్పటి ప్రయోగం తప్పితే

  చాలా కాలం తరువాత కమర్షియల్ ఫార్మాట్ కు బ్రేక్ ఇచ్చి పింక్ సినిమాను తమిళ్ లో నెర్కొండ పార్వైగా రీమేక్ చేశారు. ఆ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. ఆ తరహాలో అజిత్ చిన్నప్పటి ప్రయోగం తప్పితే మిగతా కాంట్రవర్సీలకు ఏ విధంగా వెళ్లడు.

  ఇంట్లో బాంబ్ పెట్టారు అనగానే..

  ఇంట్లో బాంబ్ పెట్టారు అనగానే..

  ఇక చాలా కాలం తరువాత అజిత్ కు ఒక బెదిరింపు కాల్ రావడంతో ఇండస్ట్రీలో అందరిని షాక్ కు గురి చేసింది. భార్యాపిల్లలతో తిరువాన్మియూరులో నివాసముంటున్న అజిత్ కు తెలియని ఒక నెంబర్ నుంచి ఫోన్ వచ్చిందట. మీ ఇంట్లో బాంబు పెట్టారు. మరికొన్ని గంటల్లో అది బ్లాస్ట్ అవుతుందని చెప్పగానే అజిత్ షాక్ అయ్యారట.

  ఇలాంటి కాల్స్ కొత్తేమి కాదు

  ఇలాంటి కాల్స్ కొత్తేమి కాదు

  వెంటనే సమీపంలో ఉన్న పోలీసులు బాంబ్ స్క్వాడ్ తో సహా ఇంటికి చేరుకొని పూర్తిగా తనిఖీలు చేశారు. అయితే ఎక్కడా కూడా ఎలాంటి బాంబ్ లబించలేదు. ఇక ఎప్పటిలానే అదొక రాంగ్ కాల్ అని అర్ధమయ్యింది. అజిత్ కు ఇది కొత్తేమి కాదు. గతంలో రెండుసార్లు ఇదే తరహాలో ఆకతాయిల నుంచి ఫోన్ కాల్స్ వచ్చాయి.

  అలాగే విజయ్, రజనీకాంత్ ఇళ్లకు కూడా అదే తరహాలో తప్పుడు కాల్స్ వచ్చాయి. అయినప్పటికీ హీరోలు ఏనాడు వాటిని జోక్ గా తీసుకోకుండా పోలీసులకు ఎప్పటికప్పుడు సమాచారం అందిస్తున్నారు.

  English summary
  The number of those who have the highest fan following among the Kollywood star heroes is slightly higher. Commercial star heroes receive box office hits from one to another from time to time. Ajith has skyrocketed his level with a series of box office hits for the last while. But recently Ajit's heart stopped beating because of one person.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X