twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Captain Twitter Review: వింత జీవితో ఆర్య యాక్షన్ సినిమా.. ఆ విషయంలోనే ఆడియెన్స్ అప్సెట్!

    |

    ప్రయోగాత్మకమైన సినిమాలతో తనకంటూ ఒక ప్రత్యేకమైన క్రేజ్ అందుకున్న ప్రముఖ తమిళ దర్శకుడు శక్తి సౌందర్ రాజన్ ఈసారి విభిన్నమైన క్రీచర్ క్యారెక్టర్ బ్యాక్ డ్రాప్ లో కెప్టెన్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఆర్య కథానాయకుడిగా ఐశ్వర్య లక్ష్మీ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో సీనియర్ స్టార్ బ్యూటీ సిమ్రాన్ కూడా ఒక ముఖ్యమైన పాత్రలో నటించింది. ఇక ఈ సినిమా నేడు భారీ స్థాయిలో విడుదలైంది. ఇక సినిమా చూసిన ఆడియెన్స్ సోషల్ మీడియా ద్వారా రివ్యూలు ఇస్తున్నారు. ఇక ట్విట్టర్ లో వచ్చిన ఆడియెన్స్ రియాక్షన్ లోకి వెళితే..

    బాగానే ఉంది.. కానీ..

    బాగానే ఉంది.. కానీ..

    ఇంతవరకు సౌత్ లో ఎన్నడు రాని వింత జీవి బ్యాక్ డ్రాప్ లో విభిన్నంగా తెరపైకి వచ్చిన కెప్టెన్ సినిమా పాయింట్ చాలా కొత్తగా ఉన్నప్పటికీ దాన్ని తెరపైకి తీసుకు రావడంలో దర్శకుడు శక్తి విఫలం అయినట్లు చెబుతున్నారు. ఫస్ట్ హాఫ్ లో స్టార్ట్ చేసిన విధానం బాగానే ఉంది కాని ఆ తరువాత కథ ముందుకు సాగుతున్న కొద్దీ నిరాశని కలిసించిందనే టాక్ వస్తోంది.

    ఇంకాస్త బెటర్ గా ఉంటే..

    ఇంకాస్త బెటర్ గా ఉంటే..

    కెప్టెన్ సినిమాపై నెటిజన్లు భిన్న అభిప్రాయాలను తెలియజేస్తున్నారు. ఆర్య అలాగే డైరెక్టర్ శక్తి సౌందర్ రాజన్ అద్భుతమైన ప్రయోగాన్ని తెరపైకి తీసుకు వచ్చారు అని VFX అలాగే స్టోరీ లైన్ ఇంకాస్త బెటర్ గా ఉంటే బాగుండేదని అంటున్నారు. ఇక ఫ్యామిలీస్ పిల్లలతో ఈ సినిమాను చూస్తే తప్పకుండా ఎంజాయ్ చేయవచ్చు అని కూడా మరికొందరు రివ్యూలు ఇస్తున్నారు.

    మరో సరికొత్త ప్రయోగం

    మరో సరికొత్త ప్రయోగం

    ఆర్య నటించిన కెప్టెన్ థ్రిల్లింగ్ గా ఉంది. ఇదొక వింత జీవి సినిమా. తమిళ ఇండస్ట్రీలో మరో సరికొత్త ప్రయోగం. 116 నిమిషాల నిడివితో ఉన్న ఈ యాక్షన్ అడ్వెంచర్ సినిమాను దర్శకుడు శక్తి సౌందర్ రాజన్ డిఫరెంట్ ఎంటర్టైనర్ గా తెరకెక్కించాడు. చాలా భిన్నంగా ఉంది అంటూ క్రిటిక్స్ నుంచి సినిమా కూడా పాజిటివ్ కామెంట్స్ అందుకుంటోంది.

    పాజిటివ్ అంశాలు

    పాజిటివ్ అంశాలు

    ఎక్కువగా సినిమాలోని పాజిటివ్ అంశాలపై ఆడియెన్స్ స్పందిస్తున్నారు. ముఖ్యంగా హీరో ఆర్య నటన అద్భుతంగా ఉంది అని అలాగే సినిమాలోని మ్యూజిక్ బ్యాగ్రౌండ్ మ్యూజిక్ కూడా చాలా అద్భుతంగా వచ్చినట్లు చెబుతున్నారు. అంతేకాకుండా సినిమాటోగ్రఫీ కథను ఎంచుకున్న విధానం అలాగే ఇతర నటీనటులు కూడా సినిమాలో అద్భుతంగా నటించినట్లు చెబుతున్నారు. కాకపోతే స్టోరీ స్క్రీన్ ప్లే విషయంలో ఇంకాస్త జాగ్రత్తలు తీసుకుంటే బాగుండేది అని గ్రాఫిక్స్ కూడా అనుకున్నంత స్థాయిలో లేవు అని డైరెక్షన్ పై కూడా కొంత నెగిటివ్ కామెంట్స్ అయితే వస్తున్నాయి.

    ఆ తరహాలో ఉందని..

    ఆ తరహాలో ఉందని..


    ఏదేమైనా కూడా కెప్టెన్ సినిమాను అంచనాలు లేకుండా చూడాలి అని కూడా మరికొందరు వారి అభిప్రాయాలను తెలియజేస్తున్నారు. ఈ సినిమాలోని ప్లాట్ చాలా ప్రామిసింగ్ గా ఉంది అని హాలీవుడ్ తరహాలో సినిమాను తెరపైకి తీసుకువచ్చారు అని మరి కొందరు చెబుతున్నారు. అలాగే మ్యాన్ వర్సెస్ ఏలియన్ తరహాలో కూడా ఈ కథాంశం ఉందని స్క్రీన్ ప్లే అయితే చాలా యావరేజ్ అని అంటున్నారు. ఇక కథను కొనసాగించిన విధానం కూడా ముందే ఊహిస్తారు అని కొన్ని సన్నివేశాలు మాత్రం మంచి త్రిల్లింగ్ గా ఉన్నట్లుగా చెబుతున్నారు. ఏదేమైనా కూడా దర్శకుడు కథనం విషయంలో ఇంకాస్త జాగ్రత్తలు తీసుకుని ఉంటే బాగుండేది అని వివరణ ఇస్తున్నారు.

    English summary
    Kollywood hero Arya captain movie twitter review
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X