పొలిటికల్ ఎంట్రీపై హీరో సూర్య కామెంట్.. సేవా కార్యక్రమాలు అందుకు చేయడం లేదు!

సినిమాలకు రాజకీయాలకు చాలా దగ్గర సంబంధం ఉంటుందని స్పెషల్ గా చెప్పనవసరం లేదు. ముఖ్యంగా తమిళ్ ఇండస్ట్రీలో ఆ కాంబినేషన్ డోస్ కాస్త గట్టిగానే ఉంటుంది. తమిళనాడు అంటేనే స్థానిక రాజకీయ గొడవలు ఒక రేంజ్ లో వైరల్ అవుతుంటాయి. సినిమా స్టార్స్ ఎఫెక్ట్ ఎప్పుడైనా గట్టిగానే ఉంటుంది. ఇప్పటికే కమల్ హాసన్ రంగంలోకి దిగారు. ఇక సూర్య కూడా త్వరలోనే ఎంట్రీ ఇస్తారని జోరుగా ప్రచారాలు జరుగుతున్నాయి.

ఆయన రెడీ అంటున్నారు గాని..

ఆయన రెడీ అంటున్నారు గాని..

ఎన్నికలకు మరో ఏడాది సమయం ఉందంటే చాలు తమిళనాడులో అంతర్గత రాజకీయాల యుద్ధాలు మొదలవుతు ఉంటాయి. ఇక వచ్చే ఎన్నికల్లో ఆ డోస్ ఇంకా ఎక్కువయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కమల్ హాసన్ అయితే గట్టిగానే ప్లాన్ చేసుకుంటున్నాడు. రజినీకాంత్ రెడీ అంటున్నాడు గాని ఇంకా ఫైనల్ కాల్ ఇవ్వలేదు. అసలు ఆయన రాజకీయాల్లోకి వస్తారనే విషయంలో చాలా అనుమానాలు ఉన్నాయి.

కుండబద్దలు కొట్టిన విజయ్

కుండబద్దలు కొట్టిన విజయ్

ఇక ఇటీవల విజయ్ పై కూడా అనేక రకాల రూమర్స్ వచ్చాయి. విజయ్ తండ్రి చంద్రశేఖర్ ఒక పార్టీ పేరు నమోదు చేయడంతో ఒక్కసారిగా ఆ న్యూస్ వైరల్ అయ్యింది. విజయ్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు కథనాలు వచ్చాయి. అయితే ఆ వార్తల డోస్ ఇంకా ఎక్కువవ్వకముందే విజయ్ క్లారిటీ ఇచ్చేశాడు. ఆ రాజకీయ పార్టీకి తనకు ఎలాంటి సంబంధం లేదని కుండబద్దలు కొట్టేశాడు.

సూర్య పొలిటికల్ ఎంట్రీపై రూమర్స్

సూర్య పొలిటికల్ ఎంట్రీపై రూమర్స్

అసలు మ్యాటర్ లోకి వస్తే.. హీరో సూర్య కూడా రాజకీయాల్లోకి రానున్నట్లు చాలా కాలంగా రూమర్స్ వస్తున్నాయి. సూర్య అగరం ట్రస్ట్ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు చేపడుతున్న విషయం తెలిసిందే. ఇక ఆయన రాజకోయల్లోకి వస్తే మరింత సేవ చేయవచ్చని అభిమానుల నుంచి కూడా డిమాండ్ వస్తోంది. కానీ సూర్య మాత్రం పెద్దగా ఇంట్రెస్ట్ చూపలేదు.

Recommended Video

Hero Surya Grand Entry In Tollywood
క్లారిటీ ఇచ్చిన సూర్య

క్లారిటీ ఇచ్చిన సూర్య

ఇక ఫైనల్ గా పొలిటికల్ రూమర్స్ వైరల్ అవుతున్న తరుణంలో సూర్య క్లారిటీ ఇవ్వక తప్పలేదు. నాకు రాజకీయాలపై పెద్దగా ఆసక్తి లేదు. ప్రస్తుతం నా మనసుకు నచ్చిన మంచి పనులు మాత్రమే చేస్తాను. సేవా దృక్పథంలోనే నలుగురికి మంచి జరగాలనే ఆలోచనతోనే సామాజిక కార్యక్రమాలు చేస్తున్నాను. ఇక ట్రస్ట్ ద్వారా నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాల వెనుక ఎలాంటి రాజకీయ ఉద్దేశ్యం లేదని సూర్య క్లారిటీగా వివరణ ఇచ్చారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X