For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  లైఫ్ ఇచ్చిన దర్శకుడి కోసం హీరో సూర్య భారీ పెట్టుబడి.. రుణం తీర్చుకునే టైమొచ్చింది!

  |

  కోలీవుడ్ సినిమా ప్రపంచంలో అగ్ర హీరోల సంఖ్య అంతకంతకూ పెరుగుతూనే ఉంది. గత పదేళ్లలో రజనీకాంత్ కమల్ హాసన్ కంటే ఎక్కువగా మిగతా హీరోలు వారి మార్కెట్ స్థాయిని అమాంతంగా పెంచుకుంటున్నారు. ప్రస్తుతం అజిత్ లాంటి వారు అక్కడ బాక్సాఫీసు రికార్డులను ఎప్పటికప్పుడు తిరగరాస్తూ ఉన్నారు. అయితే వారు మాత్రం ఎక్కువగా కమర్షియల్ సినిమాలతోనే బాక్సాఫీస్ హిట్స్ అందుకుంటున్నారు. కానీ హీరో సూర్య మాత్రం కేవలం కమర్షియల్ ఫార్మాట్ లోనే కాకుండా విభిన్నమైన కథలు ఎంచుకుంటూ భారీ ప్రయోగాలు చేస్తున్నాడు.

  యాక్టింగ్ విషయంలో కూడా అతను వేస్తున్న అడుగులు చాలా విభిన్నంగా ఉంటున్నాయి. హీరో సూర్య వీలైనంత వరకు సినిమాలో తన పాత్రను కొంత కొత్తగా ఉండాలనే అనుకుంటాడు. పాత్ర ఎలాంటిదైనా సరే ప్రాణం పెట్టి నటించగలరు. ఇక హీరోగా ప్రస్తుతం సూర్య స్థాయి ఎంత పెరిగినా కూడా తన మొదటి ప్రయాణాన్ని ఎప్పటికీ మరచిపోలేడు. సూర్యకు నటుడిగా మంచి గుర్తింపు తెచ్చిన సినిమాల్లో శివపుత్రుడు అతి ముఖ్యమైనది. ఈ సినిమాలో మెయిన్ లీడ్ లో విక్రమ్ నటించినప్పటికీ ఒక విధంగా సూర్య పాత్ర కూడా ఎంతగానో హెల్ప్ అయ్యింది. నటుడిగా తన స్థాయిని కూడా అమాంతంగా పెంచేసింది.

  Kollywood hero suriya new movie with director bala as a producer,

  అయితే ఆ సినిమాకు దర్శకత్వం వహించిన బాలా ప్రస్తుతం వరుస డిజాస్టర్స్ తో సతమతమవుతున్నాడు. విడుదలకు దగ్గరగా వచ్చిన సినిమాలు కూడా తెరపైకి రాకుండా ఆగిపోయే పరిస్థితులు ఎదురవుతున్నాయి. అర్జున్ రెడ్డి రీమేక్ ను తమిళం లో మొదట బాల తెరకెక్కించాడు. విక్రమ్ తనయుడు ధృవ్ ఇందులో హీరోగా నటించిన విషయం తెలిసిందే. కానీ ఆ సినిమా అవుట్ పుట్ పై అసంతృప్తి వ్యక్తం చేసిన హీరో విక్రమ్ సినిమా మొత్తంను క్యాన్సల్ చేసి మళ్లీ కొత్తగా వేరే దర్శకుడితో డైరెక్షన్ చేయించాడు. ఆ ప్రభావం బాలపై గట్టిగానే పడింది.

  ఎంత మంది హీరోలకు కథలను చెప్పినా కూడా ఎవరూ ఆయనతో వర్క్ చేయడానికి ఒప్పుకోలేదు. ఇక ఆ విషయం తెలుసుకున్న హీరో సూర్య మంచి అవకాశం ఇవ్వాలని ఫిక్స్ అయ్యాడట. అయితే హీరోగా కాకుండా ముందుగా ఒక నిర్మాతగా సపోర్ట్ చేయడానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది. సొంత ప్రొడక్షన్ 2D ఎంటర్టైన్మెంట్స్ లో సినిమా నిర్మించుకునేందుకు డైరెక్టర్ బాలకు మంచి అవకాశం అయితే ఇచ్చాడట. ప్రస్తుతం అందుకు సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి.

  ఇక సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తుండగా టాలెంటెడ్ నటుడు అథర్వ హీరోగా నటిస్తున్నట్లు సమాచారం. అథర్వ ఇంతకుముందు తెలుగులో గద్దలకొండ గణేష్ సినిమా లో ముఖ్యమైన పాత్రలో కనిపించిన విషయం తెలిసిందే. ఇక బాల, అథర్వ కాంబినేషన్ లో గతంలో పరదేశి అని సినిమా కూడా వచ్చింది ఇక ఇప్పుడు 2003 రూరల్ ఏరియా బ్యాక్ డ్రాప్ లో కథను సెట్ చేసుకున్నట్లు సమాచారం. ఇక సినిమాతో అయినా సీనియర్ దర్శకుడు బాల ఫామ్ లోకి వస్తాడో లేదో చూడాలి.

  English summary
  Kollywood hero suriya new movie with director bala as a producer,
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X