Thalapathy: ఇంధ్రభవనం లాంటి ఇంటిని కొనుగోలు చేసిన విజయ్.. ఆ బాధ తట్టుకోలేక భారీ ఖర్చుతో..
సౌత్ సినిమా ఇండస్ట్రీలోనే కాకుండా ఇండియా మొత్తంలో కూడా అత్యధిక ఫ్యాన్ ఫాలోయింగ్ కలిగిన హీరోలలో విజయ్ ఒకరు. ఇళయదళపతిగా తనకంటూ ఒక స్టార్ ఇమేజ్ ను సంపాదించుకున్న విజయ్ ఇప్పుడు సౌత్ ఇండస్ట్రీలో తన మార్కెట్ను మరింత పెంచుకునే విధంగా అడుగులు వేస్తూ ఉన్నాడు. ముఖ్యంగా తెలుగులో కూడా అతనికి మంచి క్రేజ్ అయితే దక్కుతొంది. అయితే రీసెంట్ గా విజయ్ తన కెరీర్లో గతంలో ఎప్పుడు లేని విధంగా అత్యధిక ధరకు ఒక ఇంటిని కొనుగోలు చేసినట్లుగా తెలుస్తోంది. పూర్తి వివరాల్లోకి వెళితే..

విజయ్ కూడా..
తమిళ చిత్ర పరిశ్రమలో ప్రస్తుతం రజనీకాంత్ కంటే ఎక్కువ స్థాయిలో మార్కెట్ క్రియేట్ చేసుకుంటూ ముందుకు సాగుతున్న ఏకైక హీరో విజయ్ అని చెప్పవచ్చు. ఒకప్పుడు తమిళ చిత్ర పరిశ్రమ అంటే రజినీకాంత్ ఆ తర్వాత కమల్ హాసన్ పేర్లు ఎక్కువగా వినిపించేవి. ఇక మధ్యలో సూర్య విక్రమ్ కూడా బాగానే క్రేజ్. అందుకున్నారు. కానీ ఇప్పుడు వారందరి కంటే ఎక్కువగా విజయ్ తన మార్కెట్ను పెంచుకునే విధంగా సినిమాలు చేస్తున్నాడు.

తెలుగులో..
తెలుగులో కూడా విజయ్ కు మంచి ఫ్యాన్ ఫాలోవర్స్ ఉన్న విషయం తెలిసిందే. అతను ఇటీవల కాలంలో నటించిన సినిమాలు తెలుగులో కూడా మంచి కలెక్షన్స్ సొంతం చేసుకుంటున్నాయి. ఇక తదుపరి సినిమాలను ఒకేసారి తెలుగు తమిళ్ లో విడుదల చేస్తూ ఉండడం విశేషం. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ప్రస్తుతం విజయ్ వారసుడు అనే సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఆ సినిమాను దిల్ రాజు నిర్మిస్తున్నారు.

భారీగా రెమ్యునరేషన్
ఇక సౌత్ ఇండస్ట్రీలో ప్రభాస్ తర్వాత అత్యధిక పారితోషికం అందుకుంటున్న హీరోల లిస్టులో అయితే విజయ్ టాప్ లో ఉన్నాడు. అతను గత రెండేళ్ళ క్రితం వరకు కూడా 60 కోట్ల రెమ్యునరేషన్ అందుకుంటూ వచ్చాడు. కానీ ఇప్పుడు మాత్రం వారసుడు సినిమాకు దాదాపు 90 కోట్లకు పైగానే డిమాండ్ చేసినట్లుగా తెలుస్తోంది.

ఆ సమస్యతో ఇల్లు చేంజ్
అయితే విజయ్ రీసెంట్ గా ఒక కొంత అపార్ట్మెంట్ ను కొనుగోలు చేసినట్లు సమాచారం. ఎప్పటినుంచో విజయ్ ఇల్లును మార్చాలి అని అనుకుంటున్నాడు. ఎందుకంటే ఈస్ట్ కోస్ట్ రోడ్ లో గత కొంతకాలంగా ఉంటున్న విజయ్ ఇల్లు రోడ్డుకు దగ్గరగా ఉండటంతో తరచుగా ట్రాఫిక్ జామ్ అవుతూ ఉండడంతో చాలా సమస్యలు ఎదురవుతున్నాయట. ఈ తరుణంలో అతను కొత్త ఇంట్లోకి షిఫ్ట్ అవ్వాలి అని గత ఏడాది నుంచి ఆలోచిస్తున్నాడు.

30 కోట్ల ఖర్చుతో..
రీసెంట్ గా చెన్నైలోనే ఒక పాష్ ఏరియాలో ఖరీదైన అపార్ట్మెంట్ ను విజయ్ కొనుగోలు చేసినట్లు సమాచారం. అందులో ఒక రెండు ఫ్లోర్లు విజయ్ దక్కించుకున్నట్లుగా తెలుస్తోంది. ఫ్యామిలీతో కలిసి అక్కడే ఉండాలి అని విజయ్ నిర్ణయించుకున్నట్లు సమాచారం. దాని ఖరీదు 30 కోట్లకు పైగానే ఉంటుందని టాక్ అయితే వస్తుంది. అంతేకాకుండా విజయ్ తనకు నచ్చినట్లుగా అపార్ట్మెంట్ లో కొన్ని మార్పులు కూడా చేసినట్లు సమాచారం. ఇక అదే అపార్ట్మెంట్లో మరో కోలీవుడ్ హీరో ఆర్య కూడా ఉన్నట్లుగా తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











