టీనేజ్ వయసులోనే విజయ్ కూతురికి భారీ క్రేజ్.. ఆ యువ హీరో కోసం..

కోలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో సాధారణంగా అభిమానులు ఒకసారి ఇష్టపడటం మొదలు పెడితే అంత ఈజీగా వదిలిపెట్టరు. అభిమానుల ప్రేమకు స్టార్ హీరోలు తీసుకునే జాగ్రత్తలు అన్ని ఇన్ని కావు. వీలైనంత వరకు వారిని నొప్పించకుండా రియల్ లైఫ్ లో మంచి పనులతో మెప్పించాలని చూస్తుంటారు. దీంతో ఫ్యాన్స్ హీరోలనే కాకుండా వారి కుటుంబ సభ్యులను కూడా ఇష్టపడటం మొదలుపెడతారు.

విజయ్ పిల్లలపై కూడా అభిమానుల ప్రేమ

విజయ్ పిల్లలపై కూడా అభిమానుల ప్రేమ

కోలీవుడ్ ఇండస్ట్రీలో రజినీకాంత్ తరువాత ఆ స్థాయిలో క్రేజ్ అందుకున్న హీరోల్లో విజయ్ ఒకరు. ఒక విధంగా రజినీకాంత్ కంటే ఎక్కువ స్థాయిలో విజయ్ తన మార్కెట్ ని పెంచుకుంటున్నాడనే చెప్పాలి. దీంతో రోజురోజుకి విజయ్ అభిమానుల సంఖ్య భారీ స్థాయిలో పెరుగుతోంది. ఇక వారి పిల్లలకు కూడా అభిమానులు ఎక్కువవుతున్నారు.

అది నిజమైన అకౌంట్..?

అది నిజమైన అకౌంట్..?


ఇటీవల విజయ్ గారాల కూతురు దివ్య షాశా విజయ్ సోషల్ మీడియాలో కాస్త హడావుడి చేస్తున్నట్లు కోలీవుడ్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఆమెకు సంబంధించిన ఫొటోలు కూడా బాగానే వైరల్ అవుతున్నాయి. అయితే దివ్య షాశా పేరుతో ఉన్న ట్విట్టర్ అకౌంట్ నుంచి రెగ్యులర్ గా విజయ్ కి సంబంధించిన అప్డేట్స్ వస్తుండడంతో చాలా మంది అది నిజమైన ఎకౌంట్ అని అనుకుంటున్నారు.

టీనేజ్ లోనే.. హీరోకు స్పెషల్ విషెస్

టీనేజ్ లోనే.. హీరోకు స్పెషల్ విషెస్

రీసెంట్ గా హీరో శాంతను పుట్టినరోజు సందర్భంగా దివ్య శుభాకాంక్షలు తెలపడంతో ఆ హీరో కూడా థ్యాంక్యూ అని సమాధానం ఇచ్చారు. దీంతో దివ్య షాశాది రియల్ ఎకౌంట్ అని విజయ్ ఫాలోవర్స్ ఆమెను ఫాలో అవుతున్నారు. కొన్ని గంటల్లోనే వేలాది మంది అభిమానులు ఆమెను ఫాలో అవ్వడం స్టార్ట్ చేశారు. టీనేజ్ లోనే ఆమె ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

Recommended Video

Happy Birthday Vijay : Thalapathy Vijay Box Office Career
హీరోగా ఎంట్రీ ఇవ్వనున్న విజయ్ తనయుడు..

హీరోగా ఎంట్రీ ఇవ్వనున్న విజయ్ తనయుడు..

కూతురు దివ్యను విజయ్ సినిమాల్లోకి తీసుకువస్తాడో లేదో తెలియదు గాని తనయుడు మాత్రం తప్పకుండా హీరోగా ఎంట్రీ ఇస్తాడు అనేది అందరికి తెలిసిన విషయమే. విజయ్ అయితే ఆ విషయంపై ఇంతవరకు పెద్దగా స్పంధించలేదు. చదువు పూర్తయిన తరువాతనే కొడుకు సినిమాల గురించి ఆలోచించాలని విజయ్ ఒక నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X