విజయ్ 180కోట్ల ప్రాజెక్ట్.. ఇలాంటి సమయంలో రిస్క్ చేయడం అవసరమా?
కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ నెక్స్ట్ సినిమా మాస్టర్ కోసం తమిళ ప్రేక్షకులు చాలా రోజులుగా ఎదురుచూస్తున్నారు. గత నెలలోనే రిలీజ్ కావాల్సిన ఈ సినిమా లాక్ డౌన్ కారణంగా వాయిదా పడింది. లాక్ డౌన్ ముగిసిన వెంటనే రిలీజ్ చేయాలని అనుకున్న చిత్ర యూనిట్ కి ఊహించని షాక్ తగిలింది. తమిళనాడులో కూడా కరోనా పాజిటివ్ ల సంఖ్య రోజేరోజుకి పెరుగుతోంది. మరణాల సంఖ్య కూడా ఎక్కువవుతోంది.
అయితే మాస్టర్ సినిమా పనులను దాదాపు ఫినిష్ చేసుకున్న చిత్ర యూనిట్ ఇప్పుడు లాక్ డౌన్ లో రిలీజ్ డేట్ పై చర్చలు జరుపుతోంది. సినిమా పూర్తిగా సిద్ధమవ్వడంతో కుదిరితే వచ్చే నెలలో సినిమాను రిలీజ్ చేసే ఛాన్స్ ఉన్నట్లు టాక్ వస్తోంది. దాదాపు 180కోట్ల భారీ బడ్జెట్ తో రూపొందించిన ఈ సినిమాను కరోనా విజృంభిస్తున్న సమయంలో రిలీజ్ చేయడం అనేది చాలా రిస్క్ అనే చెప్పాలి.

కరోనా తగ్గుముఖం పట్టాలి అంటే మరో ఆరు నెలల సమయం పట్టవచ్చని అది కూడా జాగ్రత్తగా ఉంటేనే ఇండియా నుంచి ఆ మహమ్మారిని తొలగించవచ్చని నిపుణులు చెబుతున్నారు. దీంతో జనాలు చాలా వరకు సినిమా థియేటర్స్ కి షాపింగ్ మాల్స్ కి దూరంగా ఉండే ఛాన్స్ ఉంది. పెద్ద సినిమాలపై కరోనా ప్రభావం గాట్టిగానే పడేలా కనిపిస్తోంది. హాలీవుడ్ సినిమాలు ఏడాది పాటు రిలీజ్ డేట్స్ లను మర్చిపోయాయి. ఇండియాలో కూడా దాదాపు అదే పరిస్థితి కనిపిస్తోంది. మరి విజయ్ మాస్టర్ సినిమా విషయంలో నిర్మాతలు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.


Click it and Unblock the Notifications











