తెలుగు మార్కెట్ పై తమిళ హీరోల స్పెషల్ ఫోకస్.. భారీ స్థాయిలో మరో మల్టీస్టారర్

తమిళ చిత్ర పరిశ్రమలో హీరోలు చాలా మంది తెలుగులో ఎదో ఒక విధంగా వారి అదృష్టాన్ని పరీక్షించుకున్న వారే. కంటెంట్ క్లిక్కయితే క్రేజ్ తో సంబంధం లేకుండా మన ఆడియెన్స్ బాగా సపోర్ట్ చేస్తారనేది తమిళ హీరోల నమ్మకం. ఇక విశాల్ చాలా వరకు తన సినిమాలను గ్యాప్ లేకుండా డబ్ చేస్తుంటాడు. సొంతంగా డబ్బింగ్ కూడా చెప్పుకుంటాడు. అయితే చాలా రోజుల తరువాత ఈ హీరో ఒక మల్టీస్టారర్ సినిమాతో మరోసారి క్రేజ్ పెంచుకోవాలని చూస్తున్నాడు.

విశాల్ తో రెండవసారి కలిసి నటిస్తున్న హీరో మరెవరో కాదు. హీరోగానే కాకుండా విభిన్న పాత్రలతో మెప్పించే ఆర్య. ఈ హీరో పలు సినిమాలతో తెలుగు ఆడియెన్స్ కి కూడా బాగా దగ్గరయ్యాడు. ఇక బాలా దర్శకత్వంలో తెరకెక్కిన వాడు వీడు సినిమా ఏ స్థాయిలో క్లిక్కయ్యిందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. విశాల్, ఆర్య ఆ సినిమాల్లో అన్నదమ్ములుగా నటించి వారి విభిన్నమైన నటనతో షాక్ అయ్యేలా చేశారు.

Kollywood heros arya vishal multi starrer movie after long time

ఇక ఇప్పుడు మరో విభిన్నమైన దర్శకుడు సెట్ చేసిన కథలో ఆర్య విశాల్ కలిసి నటిస్తున్నారు. విజయ్ దేవరకొండ నటించిన నోటా సినిమా దర్శకుడు ఆనంద్ శంకర్ గత కొంతకాలంగా ఒక బిగ్ బడ్జెట్ మల్టీస్టారర్ ని ప్లాన్ చేస్తున్నట్లు టాక్ వచ్చింది. విశాల్ తో పాటు ఒక టాలీవుడ్ హీరో నటిస్తున్నట్లు టాక్ కూడా వచ్చింది. కానీ ఫైనల్ గా ఆర్య సెలెక్ట్ అయ్యాడు. ఇక ఈ సినిమాను తెలుగులో కూడా భారీ స్థాయిలో రిలీజ్ చెయ్యాలని చూస్తున్నారు. తమిళ్ తెలుగులో ఒక ద్విభాషా చిత్రంగా తెరకెక్కే ఛాన్స్ ఉన్నట్లు టాక్ వస్తోంది.

అసలైతే ఆనంద్ నెక్స్ట్ సినిమాను తెలుగులో తెరకెక్కించాలని అనుకున్నాడట.. తేలుగులో స్టార్ హీరోలు ఒప్పుకోలేదని మళ్ళీ తమిళ్ వైపు వెల్లిన ఆనంద్ మొత్తానికి ఒక మల్టీస్టారర్ కథను లైన్ లో పెట్టాడు. మరి ఈ ప్రాజెక్ట్ ఎప్పుడు తెరపైకి వస్తుందో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X