ప్రాజెక్ట్ రద్దయిందా? కమల్ హాసన్-శంకర్ ‘ఇండియన్ 2’పై అసలు వాస్తవాలేంటి?
ఇండియన్ సినీ పరిశ్రమ చరిత్రలోనే కనీ వినీ ఎరుగని బడ్జెట్‌తో రూపొందిన చిత్రం '2.0'. రజనీకాంత్ హీరోగా శంకర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం కోసం లైకా ప్రొడక్షన్స్ వారు దాదాపు రూ. 543 కోట్ల బడ్జెట్ ఖర్చుపెట్టారు. అయితే ఈ మూవీ బాక్సాఫీసు వద్ద ఆశించిన స్థాయిలో వసూళ్లు సాధించలేదు.
2.0 కారణంగా లైకా సంస్థకు రూ. 100 కోట్లకుపైగా నష్టం వాటినట్లు ప్రచారం జరుగుతోంది. ఆ నష్టం పూడ్చడం కోసమే శంకర్ 'ఇండియన్ 2' మూవీ అదే సంస్థతో చేస్తున్నారని టాక్. కొన్ని రోజుల క్రితమే ఈ మూవీ అఫీషియల్‌గా లాంచ్ అయింది. ఓ వైపు షూటింగ్, సెట్స్ నిర్మాణం జరుగుతోంది. అయితే రెండుమూడు రోజులుగా 'ఇండియన్ 2' ఆగిపోయిందనే పుకార్లు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి.

ఆ వార్తల్లో వాస్తవం ఎంత?
‘ఇండియన్ 2' ప్రాజెక్ట్ ఆగిపోయిందనే వార్తల్లో నిజం లేదని చెన్నై సినీ వర్గాల సమాచారం. లైకా ప్రొడక్షన్స్‌కు చెందిన అఫీషియల్ స్పోక్ పర్సన్ ఈ విషయంపై క్లారిటీ ఇచ్చినట్లు తమిళ మీడియాలో వార్తలు వస్తున్నాయి.

రెండు భారీ షెడ్యూల్స్ పూర్తి
‘ఇండియన్ 2' చిత్రానికి సంబందించిన 2 భారీ షెడ్యూల్స్ ఇటీవలే పూర్తయినట్లు తెలుస్తోంది. దీంతో పాటు తర్వాతి షెడ్యూల్ కోసం సెట్స్ నిర్మాణం కూడా జరుగుతోందట. సినిమా ఆగిపోయినట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదని యూనిట్ సభ్యులు అంటున్నారు.

చెన్నై గోకులం స్టూడియోలో...
చెన్నైలోని గోకులం స్టూడియోస్, మొమోరియల్ హాల్ మొదటి రెండు షెడ్యూల్స్ షూటింగ్ జరిగినట్లు సమాచారం. తర్వాతి షెడ్యూల్ త్వరలోనే ప్రారంభం అవుతుందని, ఎలాంటి బ్రేక్ లేకుండా షూటింగ్ సాగుతుందని తెలుస్తోంది.

పుకార్లపై శంకర్, లైకా మౌనం
సినిమా సెట్స్ మీద ఉన్నపుడు ఇలాంటివి సర్వసాధారణమే. అందుకే ‘ఇండియన్ 2'పై వస్తున్న పుకార్లపై చిత్ర నిర్మాణ సంస్థ లైకా, దర్శకుడు శంకర్ మౌనంగానే ఉంటున్నారు. ఈ చిత్రంలో కమల్ హాసన్‌కు జోడీగా కాజల్ అగర్వాల్ నటిస్తుండగా, అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు.


Click it and Unblock the Notifications











