twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    18 కోట్ల నష్టం.. అన్‌ప్రొఫెసనల్ యాక్టర్స్.. త్రిష, శింబుపై ప్రముఖ నిర్మాత ధ్వజం

    దక్షిణాది చిత్ర పరిశ్రమలో త్రిష హవా కొనసాగుతూనే ఉంది. మధ్య మధ్యలో గ్యాప్ వచ్చినా తన కెరీర్‌కు ఎలాంటి ముప్పు లేకుండా చేసుకొంటున్నది.

    By Rajababu
    |

    Recommended Video

    త్రిష, శింబుపై ప్రముఖ నిర్మాత ఫైర్

    దక్షిణాది చిత్ర పరిశ్రమలో త్రిష హవా కొనసాగుతూనే ఉంది. మధ్య మధ్యలో గ్యాప్ వచ్చినా తన కెరీర్‌కు ఎలాంటి ముప్పు లేకుండా చేసుకొంటున్నది. హీరోయిన్‌గా సుదీర్ఘమైన కెరీర్‌లో ఎన్నో వివాదాలు కూడా త్రిష ఎదుర్కొన్నది. తాజాగా త్రిషపై ఓ నిర్మాత తీవ్ర విమర్శలు చేయడం తమిళ చిత్రపరిశ్రమలో వివాదాస్పదమైంది.

     వివాదంలో త్రిష, శింబు

    వివాదంలో త్రిష, శింబు

    సీనియర్ నటి త్రిష, శింబుపై ప్రముఖ నిర్మాత జ్ఞానవేల్ రాజా తీవ్ర ఆరోపణలు చేయడం దక్షిణాది మీడియాలో చర్చనీంశమైంది. విజయ్ ఆంటోని నటించిన అన్నాదురై (తెలుగులో ఇంద్రసేన) ఆడియో ఆవిష్కరణ కార్యక్రమంలో చేసిన వ్యాఖ్యలు మీడియాలో పెద్ద దుమారమే చెలరేగుతున్నది.

     హీరో అంటే విజయ్‌ ఆంటోని

    హీరో అంటే విజయ్‌ ఆంటోని

    అన్నాదురై ఆడియో ఆవిష్కరణ వేడుకలో ప్రముఖ నిర్మాత జ్ఞానవేల్ రాజా మాట్లాడుతూ.. విజయ్ ఆంటోనిపై ప్రశంసల వర్షం కురిపించారు. విజయ్ ఆంటోనిని చూసి చాలా మంది నేర్చుకోవాల్సింది చాలా ఉంది. ఎవరిపైన ఎలాంటి భారం మోపకుండా కెరీర్‌ను రూపుదిద్దుకోవడం విజయ్‌ ఆంటోనిని చూసి నేర్చుకోవాలి అని అన్నారు.

     జ్ఞానవేల్ రాజా ఆగ్రహం

    జ్ఞానవేల్ రాజా ఆగ్రహం

    ఇంతవరకు బాగానే ఉంది. ఇద్దరు అన్‌ప్రొఫెషనల్ యాక్లరు అని ధ్వజమెత్తిన తీరుపై అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది. హీరోయిన్ త్రిషా కృష్ణన్, శింబును ఉద్దేశించి చేసినవేనని మీడియా, అతిథులు ఓ అవగాహనకు వచ్చారు.

     అలాంటి యాక్టర్లను చూడలేదు

    అలాంటి యాక్టర్లను చూడలేదు

    నా సినీ జీవితంలో ఎంతో అంకితభావం చూపే యాక్టర్లను చూశాను. మరోవైపు అన్ ప్రొఫేషనల్ యాక్లర్లను చూశాను. ఒక నిర్మాత 18 కోట్లు నష్టపోవడానికి ఓ హీరో (శింబు) కారణమయ్యాడు.

     ప్రతీ రోజు ఆలస్యంగానే

    ప్రతీ రోజు ఆలస్యంగానే

    ఆ సదరు హీరో (శింబు) 29 రోజులు షూటించే చేస్తే దాదాపు ప్రతీ రోజు సెట్‌కు లేటుగా వచ్చేవాడు. కేవలం మొక్కుబడిగా నాలుగు గంటలు షూటింగ్‌లో ఉండి వెళ్లిపోయేవాడు. షూట్ చేసిన 30 శాతంతోనే సినిమాను రిలీజ్ చేద్దాం అని ఒత్తిడి చేశాడు. నా జీవితంలో అలాంటి నటుడిని ఇంత వరకు చూడలేదు.

     10 గంటలు వేచి చూసిన నిర్మాత

    10 గంటలు వేచి చూసిన నిర్మాత

    ఒక ఎపిసోడ్ కథను, షూటింగ్ విషయాల గురించి హీరో, హీరోయిన్లకు వివరించడానికి వెళ్లిన నిర్మాతను దాదాపు 10 గంటలపాటు వెయిట్ చేయించారు. చివరకు కథ వినకుండానే వెనకకు పంపించారు అని జ్ఞానవేల్ రాజా తెలిపారు.

     వడివేలుపై కఠిన చర్యలు

    వడివేలుపై కఠిన చర్యలు

    బాధ్యతాయుతంగా వ్యవహరించే నటీనటులు, నిర్మాతను అనేక కష్టాల పాలుచేస్తున్న కమెడియన్ వడివేలుపై కఠిన చర్యలు తీసుకోవడానికి ముందుకెళ్తున్నాం జ్ఞానవేల్ రాజా అన్నారు.

    English summary
    At the Annadurai audio launch, producer Gnanavel Raja indirectly took a dig at Kollywood superstars Simbu and Trisha. The producer also praised Vijay Antony for making a career on his own. Gananavel Raja raised eyebrows when he talked about the behavior of “unprofessional actors.” The audience, including the press, instantly knew that the producer was indirectly taking a dig at Trisha Krishnan and Simbu, who are one of the leading actors of Kollywood at present.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X