చియన్ విక్రమ్ గురించి నమ్మలేని రూమర్.. అభిమానులు రోడ్డెక్కే పరిస్థితి..

కోలీవుడ్ స్టార్ హీరో చియన్ విక్రమ్ ఒకప్పుడు వరుస విజయాలతో సౌత్ స్టార్ హీరోగా కొనసాగిన విషయం తెలిసిందే. నటన కోసం ప్రాణాలను సైతం లెక్కచేయడని స్పెషల్ గా చెప్పనవసరం లేదు. విక్రమ్ ఏ సినిమా చేసినా అందులో ఎదో ఒక కొత్త పాయింట్ ఉంటుందని ఒక బ్రాండ్ సెట్ చేసుకున్నాడు. అయితే ఆ పాజిటివ్ టాక్ ఇప్పుడు వినబడటం లేదు.

విక్రమ్ ఏ సినిమా చేసినా వర్కౌట్ కావడం లేదు. సినిమా రిలీజైన రోజే చతికిల పడుతున్నాయి. ఇక తెలుగులో అపరిచితుడు సినిమాతో రజినీకాంత్ రేంజ్ లో సక్సెస్ అందుకున్న విక్రమ్ ఆ తరువాత ఒక్క సక్సెస్ కూడా అందుకోలేకపోయాడు. తమిళ్ లో విక్రమ్ మార్కెట్ పూర్తిగా పడిపోయినట్లు టాక్ వచ్చింది. అదే విధంగా అతను సినిమాలకు కూడా వీడ్కోలు చెప్పే అవకాశం ఉన్నట్లు కథనాలు వెలువడ్డాయి.

Kollywood star actor Vikram fans angry on shocking rumors

దీంతో సోషల్ మీడియాలో విక్రమ్ ఫ్యాన్స్ ఒక్కసారిగా ట్వీట్స్ ద్వారా ఆందోళన వ్యక్తం చేశారు. దాదాపు రోడ్డెక్కే పరిస్థితులు ఏర్పడడంతో విక్రమ్ సన్నిహితులు ఈ రూమర్ ని కొట్టిపారేశారు. విక్రమ్ సినిమాలకు ఎండ్ కార్డ్ పెడుతున్నట్లు వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని ప్రస్తుతం మణిరత్నంతో ఒక బిగ్ బడ్జెట్ సినిమాని చేస్తున్నట్లు చెప్పారు. అలాగే కోబ్రా అనే సినిమాతో పాటు మరో రెండు ప్రాజెక్టులు సెట్స్ పైకి వచ్చినట్లు వివరణ ఇచ్చారు. దీంతో అభిమానులు కూడా కూల్ అయ్యారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X