Don't Miss!
- Finance
7th cpc: ప్రభుత్వ ఉద్యోగులకు పెరగనున్న జీతాలు.. ఎప్పుడు, ఏమేమి పెరుగుతాయో తెలుసా..!
- Sports
అయ్యర్ స్థానంలో అతన్ని ఆడించండి.. శుభ్మన్ గిల్ మాత్రం వద్దు: దినేశ్ కార్తీక్
- Lifestyle
మీ సెక్స్ జీవితాన్ని మెరుగుపరచుకోవడానికి ఇలా చేయండి..సెక్స్ లో ఆనందాన్ని పొందండి!
- News
ఉత్తరాంధ్రలో టీడీపీకి అగ్నిపరీక్ష: ఆ నియోజకవర్గం అభ్యర్థి మార్పు- బాలయ్య ప్రచారం చేసినా..
- Technology
ఐఫోన్ 14 పై రూ.12000 వరకు ధర తగ్గింది! ఆఫర్ ధర ,సేల్ వివరాలు!
- Travel
ఏపీలో ఆధ్యాత్మిక పర్యాటకానికి టూరిజం శాఖ సరికొత్త రూట్ మ్యాప్!
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
Anoushka: స్టార్ హీరో అజిత్ కూతురుని చూశారా.. హీరోయిన్ కంటే అందంగా లేటెస్ట్ పిక్ వైరల్!
సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోలు మాత్రమే కాకుండా వారి పిల్లలకు కూడా ఫాన్స్ ఎక్కువగా లైక్ చేస్తూ ఉంటారు. ఇక తమిళ్ ఇండస్ట్రీలో ఫ్యాన్స్ హడావిడి ఇంకా ఏ స్థాయిలో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తెలుగు వారి కంటే ఇంకా ఎక్కువ ఎమోషనల్ గా టచ్ అవుతారు. ఇక అజిత్ కుమార్ పిల్లల ఫోటోలు కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్నాయి. చాలా కాలం తర్వాత అజిత్ కుమార్ కూతురి ఫోటో కూడా బయటకు వచ్చింది. ఆ వివరాల్లోకి వెళితే..

స్టార్ హీరోగా
తమిళ ఇండస్ట్రీలో మంచి మాస్ హీరోగా గుర్తింపును అందుకున్న అజిత్ కుమార్ మెల్లగా తన మార్కెట్ను పెంచుకుంటూ ఉన్నాడు. ఈమధ్య కాలంలో అతని మార్కెట్ అయితే ఊహించని స్థాయిలో పెరిగిపోయింది. ఇక అజిత్ అలాగే విజయ్ ఫ్యాన్స్ మధ్య ఎప్పుడూ కూడా గొడవలు ఒక రేంజ్ లో జరుగుతూ ఉంటాయి. అయితే జీత్ మాత్రం అసలు ఏ వివాదాల్లోకి వెళ్ళకుండా చాలా కూల్ గా ఉండేందుకు ప్రయత్నం చేస్తాడు.

హీరోయిన్ తో పెళ్లి తరువాత
అజిత్ కుమార్ ఒకప్పటి హీరోయిన్ శాలినిని పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. ఇక ఆమెను పెళ్లి చేసుకున్న తర్వాత అజిత్ లైఫ్ మరింత డిఫరెంట్ గా మారిపోయింది. అంతకు ముందు వరకు అతను అక్కడక్కడ పార్టీలలో కనిపిస్తూ ఉండేవాడు. కానీ పెళ్లి అయిన తర్వాత మాత్రం అసలు బాహ్య ప్రపంచానికి దూరంగా షూటింగ్స్ తప్పితే మిగతా పనులు ఏవి పెట్టుకోకుండా ఫ్యామిలీ లైఫ్ తోనే బిజీగా కనిపిస్తూ ఉన్నాడు.

యూరప్ లో అజిత్ ఫ్యామిలీ
సినిమా షూటింగ్స్ లేకపోతే అజిత్ తన స్నేహితులతో కలిసి లాంగ్ బైక్ రైడ్స్ చేస్తూ ఉంటాడు. ఇక ఇటీవల తునివు సినిమా షూటింగ్ ముగిసిన తర్వాత అజిత్ తన కుటుంబ సభ్యులతో కలిసి విదేశాలకు వెళ్ళాడు. వారికి సంబంధించిన ఫోటోలు కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఎంతో ఇష్టమైన యూరోప్ లోనే వీరు న్యూ ఇయర్ సెలబ్రేషన్లో పాల్గొన్నట్లుగా తెలుస్తోంది.

క్యూట్ ఫ్యామిలీ పిక్
అజిత్ కుమార్ కు ఒక కొడుకు కూతురు ఉన్నారు. మొదట 2008లో అతనికి కూతురు పుట్టింది ఆమె పేరు అనౌష్క కుమార్. ఇక కొడుకు అద్విక్ 2017 లో జన్మించాడు. ఇక కూతురు అయితే ప్రస్తుతం విదేశాల్లోనే చదువుతున్నట్లుగా తెలుస్తోంది. ఇక వీరికి సంబంధించిన ఫోటోలు కూడా చాలా రేర్ గా బయటకు వస్తూ ఉంటాయి. ఇక ఇటీవల యూరప్ కు తన భార్య పిల్లలతో కలిసి వెళ్లాడు.

కూతురి ఫొటో వైరల్
ఇక ప్రస్తుతం అజిత్ కుమార్ కు కూతురుకు సంబంధించిన ఫోటో అయితే బాగానే వైరల్ అవుతుంది. ఆమె చిన్ననాటి ఫోటోలు సోషల్ మీడియాలో ఉన్నాయి. కానీ ఇప్పుడు 15 ఏళ్ల వయసులోకి రావడంతో ఆమె చాలా అందంగా ఉందని హీరోయిన్ కంటే క్యూట్ గా ఉంది అని ఫ్యాన్స్ అయితే చాలా పాజిటివ్గా రియాక్ట్ అవుతున్నారు. అజిత్ కుమారుడు అద్విక్ కుమార్ ఇండస్ట్రీ లోకి హీరోగా ఎంట్రీ ఇస్తాడు అంటూ ఫ్యాన్స్ ప్రేమతో కామెంట్స్ చేసుకుంటున్నారు.