స్టార్ హీరోలతో సమానంగా రెమ్యునరేషన్.. ఆ కమెడియన్ ఎవరో తెలుసా?

తమిళ స్టార్ కమెడియన్ సంతానం గురించి అందరికీ తెలిసిందే. ఆయన తమిళ ఇండస్ట్రీకి చెందిన వాడే అయినప్పటికీ.. తెలుగులోనూ చాలానే సినిమాల్లో కనిపించాడు. తెలుగు సినీ ప్రేక్షకులకు కూడా సంతానం కామెడీ అంటే చాలా ఇష్టం. ఆయన వేసే పంచులను అయితే తెగ ఎంజాయ్ చేస్తారు. ఓవైపు కమెడియన్ మరోవైపు హీరోగా కూడా ఈయన కొన్ని చిత్రాల్లో కనిపించారు. అంతే కాకుండా నిర్మాతగా కూడా కొనసాగుతూ... టాప్ పొజిషన్ లో ఉన్నాడు. ఒక్కప్పుడు చాలా తక్కువ రెమ్యునరేషన్ తీసుకున్న ఈయన.. ప్రస్తుతం స్టార్ హీరోలతో సమానంగా పారితోషికం పుచ్చుకుంటున్నారు.

2001 నుంచి సినీ రంగంలో కొనసాగుతున్న ఈయన... 2004లో మన్మధన్ అనే సినిమాలో ప్రధాన పాత్రలో నటించారు. ఆ తర్వాత ఏడాదే సచిన్, మరో రెండేళ్లకు పొల్లావధన్ అనే సినిమాల్లోనూ ఛాన్సు కొట్టేసి తన టాలెంట్ ప్రూవ్ చేసుకున్నాడు. ఇక ఆ తర్వాత అరై ఎన్ 305 ఇల్ కడవుల్, సక్క పోడు పోడు రాజా, ఏ1, బిస్కోత్, పారిస్ జయరాజ్, దిక్కిలూనా, సభాపతి, గులుగులు వంటి చిత్రాల్లోనూ నటించి మెప్పించాడు. అలాగే కన్న లడ్డు తిన్న ఆశయ్యా, వల్లవనుక్కు ఫుల్లుం ఆయుధం, ఇనిమే ఇప్పడితాన్, దిల్లుకు దుడ్డు, దిల్లుకు దిడ్డు 2, దగాల్టీ వంటి సినిమాల్లో నటించడంతో పాటు ప్రొడ్యూసర్ గా కూడా పని చేశాడు.

Kollywood Star Comedian Santham Taking Remuneration Equal to Star Heros

ఇక ఆ తర్వాత దర్శకులందరికీ మంచి ఆప్షన్ గా మారిన ఈయన.. కమెడియన్ గానే కాకుండా హీరోలకు ఫ్రెండ్ రోల్ లో ఎక్కువగా కనిపిస్తుంటారు. ఈయన నటనకు అంతా ఫిదా అవుతుండడంతో చాలా మంది ఈయన్ను తమ సినిమాల్లో పెట్టుకోవాలని భావిస్తుంటారు. అయితే తాజాగా ఈయన రెమ్యురేషన్ గురించి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. అందుకూ ఓ కారణం ఉందిలెండి. అదేంటీ అంటారా... స్వయంగా టాప్ ప్రొడ్యూసర్ జ్ఞానవేల్ రాజా సంతానం రెమ్యునరేషన్ గురించి చెప్పారు. ఆ కామెంట్లు నెట్టింట వైరల్ గా మారాయి.

జ్ఞానవేల్ నిర్మించిన వర్ ఖాదాన్ సినిమా కోసం సంతానానిని కేవలం లక్షా 75 వేల రూపాయలను మాత్రమే పారితోషికంగా అందించారట. కానీ ప్రస్తుతం సంతానం 3 కోట్ల వరకూ రెమ్యునరేషన్ తీసుకుంటున్నారట... మరికొన్ని రోజుల్లోనే ఆయన 30 కోట్ల తీసుకునే స్థాయికి రావానుకుంటున్నట్లు కూడా జ్ఞానవేల్ పేర్కొన్నారు. సాధారణంగా స్టార్ హీరోలు కూడా 3 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటున్న ఈ కాలంలో ఓ కమెడియన్ అంత పెద్ద మొత్తం పారితోషికం అందుకోవడం అంటే చిన్న విషయం కాదు. అందుకే సంతానం రెమ్యునరేషన్ కు సంబంధించిన వార్తలు ఫుల్ వైరల్ అయ్యాయి.

Kollywood Star Comedian Santham Taking Remuneration Equal to Star Heros

ప్రస్తుతం సంతానం తన సొంత స్టూడియో గ్రీన్ పతాకంపై తానే హీరోగా 80స్ బిల్డప్ అనే సినిమా తీస్తున్నారు. అయితే ఈ చిత్రానికి కల్యాణ్ దర్శకత్వం వహిస్తుండగా.. రాజేంద్రన్, కేఎస్ రవికుమార్, మన్సూర్ అలీఖాన్, రామ్ దాస్, ఆనంద్ రాజ్, రాధికా ప్రీతి, తంగదురైలు ప్రధాన పాత్రల్లో కనిపించబోతున్నారు. అలాగే జ్ఞానవేల్ రాజా ఈ చిత్రానికి ప్రొడ్యూసర్ గా పని చేస్తున్నారు. నవంబర్ 24వ తేదీన విడుదల కాబోతున్న ఈ కామెడీ చిత్రం ఏ రేంజ్ లో హిట్టు కాబోతుందో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X