150 కోట్లతో పొయెస్ గార్డెన్ ఇల్లు.. ధనుష్ ను ఏకిపారేస్తున్న నెటిజన్స్
పాత్రకు తగ్గట్టుగా మేకోవర్ కావడం, సినిమా కోసం డెడికేషన్‌గా పనిచేయడం కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్‌ను ఎక్కడో పెట్టింది. వైవిధ్యానికి కేరాఫ్‌గా నిలిచే ఆయన పాత్రకు తగ్గట్లుగా మలచుకోవడానికి ఎంతటి కష్టాన్నైనా భరిస్తారు. వయసుకు మించిన క్యారెక్టర్లలోనూ ఇమిడిపోగలడు.. యూత్ ఫుల్ రోల్స్‌లో ఎంటర్‌టైన్ చేయనూగలడు. లవ్, కామెడీ, యాక్షన్, రొమాన్స్ ఇలా జోనర్ అయినా తన మార్క్ చూపిస్తారు ధనుష్. మొన్నామధ్య డంపింగ్ యార్డ్ దగ్గర ఏకంగా 10 గంటల సేపు గడిపారు ధనుష్.
సూపర్‌స్టార్ రజనీకాంత్ అల్లుడైనప్పటికీ నిరాడంబరంగా ఉండటానికే ఆయన ఇష్టపడతారు. నటుడిగా ఒక్కో మెట్టు ఎక్కుతూ కోలీవుడ్‌లోనే కాకుండా బాలీవుడ్, హాలీవుడ్, టాలీవుడ్‌లలో అభిమానులను సంపాదించుకున్నారు ధనుష్. వృత్తినే దైవంగా భావించే ఆయన.. అవకాశాలు ఎప్పుడూ రావని, వచ్చినప్పుడు కష్టపడి పనిచేయాలని ధనుష్ బలంగా నమ్ముతారు. బక్కపల్చని దేహం, పైగా ఛామన ఛాయ .. హీరోకి ఏమాత్రం సెట్ కాని కటౌట్ అయినప్పటికీ ధనుష్‌కి ఈ రేంజ్‌లో ఫాలోయింగ్ ఉందంటే అందుకు ఆయన టాలెంటే కారణం. ఎంత ఎదిగినా ఒదిగి ఉండే తత్వమే ధనుష్‌ను అంతా ఇష్టపడటానికి కారణం.

ఇదిలావుండగా ధనుష్ క్రేజీ ప్రాజెక్ట్‌లతో బిజీగా వున్నారు. ఇప్పటికే ఆయన నటించిన కెప్టెన్ మిల్లర్ రిలీజ్ కాగా.. టాలీవుడ్‌లో ఫీల్ గుడ్ మూవీలకు కేరాఫ్‌గా నిలిచే శేఖర్ కమ్ముల దర్శకత్వంలో కింగ్ నాగార్జునతో కలిసి కుబేరలో నటిస్తున్నారు ధనుష్. నాగ్‌తో కలిసి ధనుష్ నటిస్తూ ఉండటం , ఈ చిత్రానికి శేఖర్ కమ్ముల దర్శకత్వం వహిస్తుండటంతో కుబేరపై భారీ అంచనాలున్నాయి. ఈ మూవీలో నేషనల్ క్రష్ రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తున్నారు. అలాగే తాను స్వయంగా రచయితగా, దర్శకుడిగా పనిచేసిన రాయన్ రిలీజ్‌కు సిద్ధమైంది. ఈ మూవీలో ఎస్ జే సూర్య, సందీప్ కిషన్, సెల్వరాఘవన్, ప్రకాష్ రాజ్, అపర్ణా బాలమురళి, వరలక్ష్మీ శరత్ కుమార్‌లు కీలకపాత్ర పోషిస్తున్నారు.

రాయన్ ప్రమోషన్ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్న ధనుష్ .. ఇటీవల జరిగిన ఆడియో లాంచ్ కార్యక్రమంలో తన కెరీర్‌పై షాకింగ్ కామెంట్స్ చేశారు. చిన్నప్పుడు చాలా కష్టాలు పడ్డానని.. వీధుల్లో పెరిగిన తాను పోయెస్ గార్డెన్‌లో ఇంటిని కొనుగోలు చేసినట్లు ధనుష్ తెలిపారు. టీనేజ్‌లో ఉండగా పోయెస్ గార్డెన్‌లో రజనీకాంత్ ఇంటిని చూడటానికి వెళ్లేవాడినని.. ఆ పక్కనే జయలలిత ఇల్లు కూడా ఉండేదని .. అది చూసి ఎప్పటికైనా ఈ ప్రాంతంలో ఇల్లు కొనుక్కోవాలని నిర్ణయించుకున్నట్లు ఆయన వెల్లడించారు. దాదాపు రూ.150 కోట్లతో పోయస్ గార్డెన్‌లో ధనుష్ ఇల్లు కట్టించుకున్నట్లుగా 2021లోనే వార్తలు వచ్చాయి.

ఈ నేపథ్యంలోనే ధనుష్ ప్రసంగంపై నెటిజన్లు భగ్గుమంటున్నారు. మీరు కష్టపడి పైకొచ్చారని చెప్పడం కామెడీగా ఉందని, మీ నాన్న, మీ బ్రదర్ ఇద్దరూ దర్శకులేనని.. అందుకే ఎలాంటి టాలెంట్ లేకపోయినా తొలినాళ్లలో నెట్టుకొచ్చారంటూ చురకలంటిస్తున్నారు. జీవితంలో బాగా సెటిలై.. తీరా ఇప్పుడేమో వీధుల్లో నుంచి వచ్చానని చెప్పడం తప్పని, ప్రమోషన్స్ కోసం ఏది పడితే అది మాట్లాడతారా అంటూ నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ధనుష్ జీవితంలో ఒకసారైనా వీధుల్లోకి వెళ్లి చూశారా అంటూ ట్రోల్ చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











