నటుడిగా మారుతున్న సంచలన దర్శకుడు.. మహనటిగా పోటీగా..

కోలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో చాలా మంది దర్శకులు రెగ్యులర్ నటులుగా మారుతున్న విషయం తెలిసిందే. సినిమాలో నటించడం నేర్పే వారు నటనలో రాటు దెలితే ఎలా ఉంటుందో కొందరు దర్శకులు చాలా తెలివిగా తమను తాము సరికొత్తగా ప్రజెంట్ చేసుకుంటున్నారు. ఇక కోలీవుడ్ సంచలన దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న సెల్వా రాఘవన్ కూడా నటుడిగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు.

7/G బృందావనం కాలనీ, ఆడవారి మాటలకు అర్దాలే వేరులే, యుగానికి ఒక్కడు వంటి సినిమాలతో తెలుగు ఆడియెన్స్ కి కూడా బాగా దగ్గరయ్యాడు సెల్వా రాఘవన్. చివరగా ఈ దర్శకుడు సూర్యతో NGK అనే సినిమాతో వచ్చాడు. అయితే ఆ సినిమా అంతగా సక్సెస్ అవ్వలేడు. గత కొంత కాలంగా దర్శకుడిగా రాఘవన్ కి సరైన సక్సెస్ లు లేవు.

Kollywood star director selva raghavan acting debut

తన సోదరుడైన ధనుష్ తోనే మరో ప్రయోగాత్మకమైన సినిమాతో హిట్టు కొట్టాలని చూస్తున్నాడు. అయితే ఓ వైపు దర్శకుడిగా ఉంటూనే మరోవైపు నటుడిగా కూడా బిజీ అవ్వాలని శ్రీ రాఘవ ప్లాన్ చేసుకుంటున్నాడు. మొదట కీర్తి సురేష్ నటిస్తున్న 'సానీ కాయుధమ్'‌ అనే చిత్రంలో సెల్వా రాఘవన్ ఒక కీలక పాత్రలో నటించనున్నాడట.

అరుణ్‌ మాతేశ్వరన్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ ని కూడా ఇటీవల రిలీజ్ చేశారు. సెల్వా రాఘవన్ మొదటిసారి నటిస్తుండడంతో ఈ సినిమాపై ఓ వర్గం ఆడియెన్స్ లో అంచనాలు పెరిగాయి. సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మరి మొదటి సారి నటుడిగా కనిపించనున్న సెల్వా రాఘవన్ ఎంతవరకు ఆకట్టుకుంటాడో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X