ఇండియన్ 2పైనే ఆధారపడిన శంకర్ కెరీర్.. హిట్టయితేనే అంతకు మించి.. మరో రెండు సీక్వెల్స్
ఇండియాలోనే మోస్ట్ టాలెంటెడ్ టెక్నీషియన్ గా గుర్తింపు తెచ్చుకున్న శంకర్ సినిమాలు అంటే అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చుతాయి. ఆయన ఎలాంటి కథ తీసుకున్నా కూడా అందులో ఒక ఎదో మెస్సేజ్ ఉంటుందని చెప్పవచ్చు. అయితే రోబో తరువాత శంకర్ చేస్తున్న ప్రయోగాలు చాలా వరకు వర్కౌట్ కావడం లేదు. ఇక హిట్ ఫార్ములాలకు సీక్వెల్స్ రెడీ చేసి మళ్ళీ హిట్టు కొట్టాలని చూస్తున్నాడు.

ఇండియన్ 2 హిట్టయితేనే..
ప్రస్తుతం శంకర్ ఇండియన్ 2 సినిమాను రెడీ చేస్తున్న విషయం తెలిసిందే. 1996లో వచ్చిన ఇండియన్ సినిమకు సీక్వెల్ గా రూపొందుతున్న ఈ సినిమాపై అంచనాలు అయితే బాగానే ఉన్నాయి. కానీ రోబో సీక్వెల్ 2.0 మాత్రం క్లిక్కవ్వలేదు. ఇప్పుడు శంకర్ కెరీర్ క్లిష్టంగా మారింది. ఇండియన్ 2 హిట్టయితేనే ఆ తరువాత ఆయన రేంజ్ లో సినిమాలు తీసే అవకాశం ఉంటుంది.

మరో రెండు సక్సెస్ ఫుల్ సీక్వెల్స్
రోబో తరువాత స్నేహితుడు, ఐ, 2.0 సినిమాలు అంచనాలకు తగ్గట్టుగా వర్కౌట్ కాలేదు. ముఖ్యంగా రోబో సీక్వెల్ భారీ దెబ్బ కొట్టింది. అందుకే శంకర్ ముందు జాగ్రత్తగా ఆ సినిమా రిలీజ్ కంటే ముందే ఇండియన్ 2 సినిమాను ఎనౌన్స్ చేశాడు. ఇక ఇప్పుడు మరో రెండు సక్సెస్ ఫుల్ సీక్వెల్స్ కి రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది.

జెంటిల్ మెన్ 2పై క్లారిటీ ఇచ్చిన నిర్మాత
1993లో జెంటిల్ మెన్ సినిమాతో శంకర్ కెరీర్ స్టార్ట్ అయ్యింది. నిర్మాత KT కుంజుమోన్ ఆ సినిమాకు సీక్వెల్ రానున్నట్లు అఫీషియల్ ఎనౌన్స్మెంట్ అయితే ఇచ్చాడు. వైద్య విద్యా వ్యవస్థలో జరుగుతున్న మోసాన్ని అప్పట్లోనే చాలా ఎమోషనల్ గా చూపించిన శంకర్ ఈ సారి ఇంకా ఎక్కువ దుర్మార్గాలు జరుగుతున్నాయి కాబట్టి అంతకు మించి చూపించబోతున్నారట.
Recommended Video

అపరిచితుడు కోసం కొన్ని పాయింట్స్..
లాక్ డౌన్ లోనే శంకర్ జెంటిల్ మెన్ కథకు సీక్వెల్ ని రెడీ చేశాడని తెలుస్తోంది. ఇక అదే విధంగా అపరిచితుడు కోసం కూడా కొన్ని పాయింట్స్ ని సెట్ చేసుకున్నట్లు సమాచారం. కానీ ఇంకా ఫుల్ స్క్రిప్ట్ రెడీ కాలేదట. తన కెరీర్ లో శంకర్ ఎక్కువగా ఇష్టపడే చిత్రం ఇదే. ఎలాగైనా ఆ కథను కూడా అంతకు మించి అనేలా రెడీ చెయ్యాలని ప్లాన్ చేసుకుంటున్నాడు. మరి శంకర్ డ్రీమ్ ప్రాజెక్టులు ఎప్పుడు తెరపైకి వస్తాయో చూడాలి.


Click it and Unblock the Notifications











