Karthi: ఒకేసారి మూడు హిట్టు సినిమాలకు సీక్వెల్.. కార్తీ న్యూ రికార్డ్!

కోలీవుడ్ చిత్ర పరిశ్రమలో ఇప్పుడు శరవేగంగా సినిమాలు తీస్తున్న హీరోలలో కార్తీ ఒకరు. సూర్య తమ్ముడిగా తెలుగు చిత్ర పరిశ్రమలో కూడా అతను మంచి గుర్తింపును అయితే అందుకున్నాడు. అతనికి కెరీర్ మొదట్లో వచ్చిన సక్సెస్ లు ఆ తర్వాత అయితే మళ్ళీ రాలేదు. ముఖ్యంగా యుగానికి ఒక్కడు ఆవారా రెండు సినిమాలు కూడా తమిళంలో కంటే తెలుగులోనే ఎక్కువ స్థాయిలో సక్సెస్ అయ్యాయి. అందుకే కార్తీ తనకు మొదటి విజయాలు ఇక్కడే వచ్చాయి అని అందుకే తెలుగు ప్రజలు అంటే తనకు ఎంతో ఇష్టమని కూడా అంటూ ఉంటాడు. మళ్ళీ చాలా కాలం తరువాత కార్తీ సర్దార్ సినిమాతో సక్సెస్ అందుకున్నాడు.

ఇక ప్రత్యేకంగా కార్తీ ప్రతి సినిమాకు కూడా తెలుగులోనే డబ్బింగ్ చెబుతూ ఉంటాడు. ఎంత బిజీగా ఉన్నప్పటికీ కూడా తెలుగులో ప్రమోషన్స్ చేయకుండా ఉండలేడు. రిజల్ట్ తో సంబంధం లేకుండా మళ్లీ తదుపరి సినిమాలను వెంటవెంటనే తెలుగులో కూడా విడుదల చేస్తూ ఉంటాడు. ఇక రాబోయే రోజుల్లో కార్తీ నుంచి మరిన్ని సీక్వెల్ కథలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. ప్రస్తుతం సౌత్ ఇండస్ట్రీలోనే కాకుండా దేశంలో ఎవరు ట్రై చేయని విధంగా కార్తీ ఎక్కువ సీక్వెల్స్ లలో నటిస్తూ ఉండడం విశేషం.

Kollywood star hero karthi back to back sequel projects lineup

ఇప్పటికే మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్ పొన్నియిన్ సిల్వెన్ సెకండ్ పార్ట్ లో నటిస్తున్న విషయం తెలిసిందే. ఆ సినిమా 2023 సమ్మర్ లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక అలాగే లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో ఖైదీ సినిమాతో భారీ స్థాయిలో విజయాన్ని అందుకున్న కార్తి త్వరలోనే ఆ సినిమాకు సంబంధించిన సీక్వెల్ కూడా స్టార్ట్ చేయబోతున్నాడు.

ఇక రీసెంట్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సర్దార్ సినిమా తెలుగులో కూడా మంచి విజయాన్ని అందుకుంది. దీంతో ఈ సినిమాను కూడా సీక్వెల్ చేయబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. పిఎస్ మిత్రన్ దర్శకత్వంలో తరికెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఇప్పటికే పెట్టిన పెట్టుబడిని వెనక్కి తెచ్చేసింది. దీంతో కార్తీ సీక్వెల్ కదపై కూడా చర్చలు జరిపామని త్వరలోనే ఆ ప్రాజెక్టు కూడా సెట్స్ పైకి వెళ్లబోతుంది అని అన్నారు. దాదాపు ఓకే టైం లో కార్తీ 3 సీక్వెల్స్ కు సంబంధించిన సినిమాలతో బిజీ కావడం విశేషం. మరి ఆ సినిమాలు అతని మార్కెట్ ను ఎంత పెంచుతాయో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X