తమన్నాతో రిలేషన్ .. భర్తను టార్చర్ చేస్తోన్న ఆ స్టార్ హీరో భార్య , నిఘా పెట్టి మరి

చిత్ర సీమలో హీరో హీరోయిన్లు కొంచెం క్లోజ్‌గా ఉన్నా చాలు వారి గురించి ఏవేవో రాసేస్తుంటారు కొందరు పుకారు రాయుళ్లు. సోషల్ మీడియా రాకతో ఇది మరింత తీవ్రమైంది. దీంతో ఏ వార్త నిజమో, ఏది అబద్ధమో తెలుసుకోలేని పరిస్ధితి నెలకొంది. ఎవరైనా హీరో , లేదా దర్శకుడు రీపిటెడ్‌గా ఒకరే హీరోయిన్‌కి ఛాన్స్ ఇస్తే చాలు ఇక వారి గురించి సోషల్ మీడియాలో మోత మోగిపోతుంది. తాజాగా ఈ ఇద్దరు హీరో, హీరోయిన్ల గురించి ఇదే చోటు చేసుకుంది.

కోలీవుడ్ సీనియర్ నటుడు శివ కుమార్ తనయుడు, స్టార్ హీరో సూర్యకి తమ్ముడిగా వెండితెరపై ఎంట్రీ ఇచ్చారు కార్తీ. 2004లో మణిరత్నం దర్శకత్వంలో సూర్య, సిద్ధార్ధ్, మాధవన్ కీలక పాత్రలు పోషించిన ఆయుత ఇజుతు సినిమాలో ఓ చిన్న పాత్ర ద్వారా కోలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చారు కార్తీ. తర్వాత పరుత్తివీరన్, అయిరతిల్ ఒరువన్, పయ్యా, సిరుత్తై, శగుని, అలెక్ష్ పాండియన్, బిర్యానీ, మద్రాస్, కొంబన్, ఊపిరి, ఖైదీ, తంబి, విక్రమ్, పొన్నియన్ సెల్వన్ , సర్దార్, మార్క్ ఆంటోనీ, కంగువా తదితర చిత్రాలతో తమిళ చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోలలో ఒకరిగా గుర్తింపు తెచ్చుకున్నారు కార్తీ.

kollywood star hero karthi Sivakumar denies affair with Tamannaah Bhatia

డబ్బింగ్ చిత్రాల ద్వారా తెలుగువారిని అలరించిన కార్తీ.. తెలుగు రాష్ట్రాల్లో మంచి మార్కెట్‌ను దక్కించుకున్నారు. చిన్నప్పటి నుంచి తెలుగు భాషను ఎంతో ఇష్టపడే కార్తీ.. తెలుగును అనర్గళంగా మాట్లాడగలరు. అది కూడా తెలుగువారితో బంధానికి బాటలు వేసింది. రజనీ చిన్న స్వామిని పెళ్లాడిన కార్తీకి ఇద్దరు పిల్లలు. సినిమాలు, వ్యక్తిగత జీవితంలో నాకు నాన్న, అన్నయ్యలే స్పూర్తి అని వారిపై ఇష్టాన్ని పలు సందర్భాలలో బయటపెట్టారు కార్తీ.

ఇక ఏ హీరోకైనా కెరీర్‌లో పలు రకాల రూమర్స్ ఎదురుకావడం ఖాయం. మరి దాదాపు 20 ఏళ్లుగా నటిస్తున్న కార్తీపైనా ఎన్నో పుకార్లు వచ్చాయి. ముఖ్యంగా మిల్కీబ్యూటీ తమన్నా - కార్తీ రిలేషన్‌లో ఉన్నట్లుగా కోలీవుడ్ మీడియా కోడై కూసింది. వీరిద్దరూ కలిసి కో, సిరుత్తై, ఊపిరి, పయ్యా సినిమాలలో నటించారు. వీరిద్దరి మధ్య ఎఫైర్ ఉంది కాబట్టే.. సినిమాలలో రొమాంటిక్ సీన్స్‌లో అంతలా లీనమైన నటించారని మీడియాలో గాసిప్స్ వైరల్ అయ్యాయి. వీటిపై తమన్నా ఎప్పుడో స్పందించారు. ఆన్‌లైన్‌లో ఇలాంటివి చూసి తాను నవ్వుకుంటానని.. కథ ప్రకారం ఈ సీన్స్‌లో నటించామమని, అంత మాత్రాన మా ఇద్దరి మధ్య ఎఫైర్ ఉందని అనుకోవడం సరికాదని తమన్నాతెలిపారు.

తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న కార్తీ కూడా తమన్నాతో ఎఫైర్ ఉందంటూ వస్తున్న వార్తలపై స్పందించారు. ఒక హీరో ఒకే హీరోయిన్‌తో పలుమార్లు పనిచేస్తే ఇలాంటి రూమర్స్ సహజమేనని అన్నారు. ఇద్దరం కెరీర్‌లో అప్పుడే పైకి వస్తున్నామని, పైగా ఆ వయసులో ఇలాంటి రూమర్స్‌ని బాగా ఎంజాయ్ చేశామని కార్తీ తెలిపారు. తాను చదుకున్నది పూర్తిగా బాయ్స్ స్కూల్‌ అని.. కాలేజీలో మెకానికల్ బ్యాక్‌గ్రౌండ్ కావడంతో అమ్మాయిలకు దూరంగా ఉన్నట్లు చెప్పారు.

ఆవారా చేసిన తర్వాత ఎక్కడికెళ్లినా నన్ను పెళ్లి చేసుకోమంటూ కాలేజీ అమ్మాయిలు వెంట పడేవాళ్లని కార్తీ గుర్తుచేసుకున్నారు. పెళ్లాయ్యాక లవ్ సీన్స్‌లో టచ్ చేయకుండా యాక్ట్ చేయలేవా అని నా భార్య తనతో గొడవ పడుతుందని తెలిపారు. తాను సీన్ బాగా రావాలని క్యారెక్టర్‌‌లో బాగా లీనమైపోతానని.. కానీ ఎవరి భార్య అయినా తన భర్త మరో అమ్మాయితో క్లోజ్‌గా ఉంటే తట్టుకోలేదని కార్తీ చెప్పారు. ఇప్పటికీ మా మధ్య ఈ విషయమై గొడవ జరుగుతూనే ఉందని.. అలాంటి సీన్స్ వస్తే చూడొద్దని నా భార్యకి చెబుతానని కార్తీ వెల్లడించారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X