Don't Miss!
- Finance
mahindra erupee: పండ్ల దుకాణంలో మహీంద్రా.. పేమెంట్ ఎలా చేశారో తెలుసా..?
- Lifestyle
Chanakya Niti: ఈ తప్పుల వల్ల లక్ష్మీ దేవి ఆగ్రహానికి గురవుతారు, ఆర్థిక సమస్యలు చుట్టుముడతాయి
- News
MP కేశినేనిని 'అతని' చేతుల్లో పెట్టిన చంద్రబాబు!
- Sports
INDvsNZ : గాయంతో టీ20 సిరీస్ యువ బ్యాటర్ దూరం?.. రిప్లేస్ చేసే సత్తా వీళ్లకే..!
- Automobiles
అప్డేటెడ్ హోండా యాక్టివా కొనేవారు తప్పకుండా తెలుసుకోవాల్సిన 5 విషయాలు
- Technology
Poco X5 Pro 5G ఇండియా లాంచ్ తేదీ మరియు ధర లీక్ అయింది! వివరాలు
- Travel
భాగ్యనగరపు పర్యాటక ఆకర్షణ.. గోల్కొండ కోట!
విజయ్ విడాకులు తీసుకోబోతున్నాడా? 23 ఏళ్ళ బంధానికి శుభం కార్డు అంటూ..
తమిళ చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోగా మంచి గుర్తింపును అందుకున్న విజయ్ కు ఇప్పుడు స్టార్ హోదా అయితే మామూలుగా లేదు. సౌత్ ఇండస్ట్రీలో అందరికంటే ఎక్కువ స్థాయిలో పారితోషికం అందుకున్న హీరోలలో అతను కూడా ఒకడు. ఒక విధంగా సౌత్ లో ఇప్పుడు అత్యధిక మార్కెట్ ఉన్న హీరో కూడా అతనే అని చెప్పవచ్చు. అయితే వారసుడు సినిమా విడుదలవుతున్న సమయంలో విజయ్ పర్సనల్ లైఫ్ కు సంబంధించిన కొన్ని రకాల వార్తలు వైరల్ అవుతున్నాయి. అతను తన భార్యకు విడాకులు ఇవ్వబోతున్నట్లుగా అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. ఇక అది ఎంతవరకు నిజమనే వివరాల్లోకి వెళితే..

నెగటివ్ కామెంట్స్
విజయ్ నటించిన వారసుడు సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 11వ తేదీన తెలుగు తమిళంలో ఒకేసారి విడుదల కాబోతోంది. అయితే ఈ క్రమంలో ఈ సినిమాపై ఊహించని విధంగా కొన్ని నెగటివ్ కామెంట్స్ కూడా ఎక్కువ అవుతున్నాయి. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ పై కూడా దారుణంగా కొంతమంది కావాలని ట్రోల్ చేస్తున్నారు అని విజయ అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

విజయ్ పర్సనల్ లైఫ్
ఇక విజయ్ పర్సనల్ లైఫ్ కు సంబంధించిన వార్తలు ఎక్కువగా అయితే బయటకు రావు. అతని కుమారుడి ఫోటోలు మాత్రం అప్పుడప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంటాయి. విజయ్ కు కుమారుడు కూతురు ఉన్నారు. ఇక వారు మాత్రం విదేశాల్లోనే చదువుకున్న సాగిస్తున్నారు. సాధారణంగా విజయ్ తను కూడా ఎప్పుడు మీడియా ముందుకు రాడు. అలాగే తన ఫ్యామిలీ విషయాలు కూడా బయటకు లీక్ కాకుండానే చూసుకుంటూ ఉంటాడు.

అందుకే రాలేదా?
అయితే
23
ఏళ్ల
నుంచి
ఎంతో
అన్యోన్యంగా
కొనసాగుతున్న
వారి
దాంపత్య
జీవితం
గురించి
ఊహించని
విధంగా
కొన్ని
నెగిటివ్
వార్తలు
సోషల్
మీడియాలో
వైరల్
అవుతూ
ఉండడం
ఫాన్స్
లో
కూడా
ఒక్కసారిగా
ఆశ్చర్యాన్ని
కలిగించింది.
విజయ్
తన
భార్య
నుంచి
విడిపోతున్నాడు
అని
అందుకే
వారి
కుటుంబ
సభ్యులు
కూడా
వారసుడు
సినిమా
ఈవెంట్
కు
రాలేదు
అని
కొన్ని
తమిళ
మీడియాలో
కథనాలు
కూడా
రావడం
ఆశ్చర్యాన్ని
కలిగించింది.

ప్రేమ వివాహం
విజయ్
సతీమణి
సంగీత
తన
భర్త
సినిమా
వేడుకలలో
కనిపించడం
మాత్రం
చాలా
అరుదు.
ఇక
వీరిద్దరిది
ప్రేమ
వివాహమే
అని
అందరికీ
తెలిసిన
విషయమే.
విజయ్
అభిమానిగా
ఉన్న
ఆమె
ఒకసారి
యూకే
నుంచి
ఇండియాకు
వచ్చి
విజయ్
ను
కలిసింది.
ఇక
ఆ
తర్వాత
పెద్దలను
ఒప్పించి
పెళ్లి
చేసుకున్నారు.
అప్పట్లో
విజయ్
ప్రేమకు
సంబంధించిన
వార్తలు
కూడా
చాలానే
వచ్చాయి.

అందులో నిజం లేదు
ఇక ఇప్పుడు వారసుడు సినిమా విడుదలవుతున్న సమయంలో విజయ్ తన భార్యకు విడాకులు ఇవ్వబోతున్నట్లుగా వార్తలు రావడంతో ఫ్యాన్స్ అందరూ కూడా షాక్ అయ్యారు. అయితే ఇందులో ఎలాంటి నిజం లేదని తెలుస్తోంది. ముందస్తు ప్రణాళికతోనే విజయ్ పిల్లలు భార్య అందరూ కూడా ఒక వెకేషన్ కి వెళ్లాలని అనుకున్నారట. ఇక అదే సమయంలో వారసుడు సినిమా ఈవెంట్ పెట్టుకోవడం వలన విజయ్ కు వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది. ఇక ప్లాన్ చెడిపోకూడదు అని తన కుటుంబాన్ని విజయ్ పంపినట్లు తెలుస్తోంది. అంతేగాని విజయ్ తన భార్య నుంచి విడాకులు తీసుకుంటున్నట్లు వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదు అని సన్నిహితుల ద్వారా తెలిసింది.