twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    తెలుగు మార్కెట్ పై మరోసారి స్పెషల్ ఫోకస్ పెట్టిన విజయ్.. న్యూ ప్లాన్ రెడీ!

    |

    కోలీవుడ్ ఇండస్ట్రీలో వందల కోట్ల బిజినెస్ చేయగల హీరోలు చాలా మంది ఉన్నారు. ఇక ఇటీవల కాలంలో రజినీకాంత్ మార్కెట్ ని సైతం మించిపోతున్నాడు విజయ్. గతంలో రజినీకాంత్, కమల్ తరువాత సూర్య, విశాల్, కార్తీ వంటి వారు మాత్రమే టాలీవుడ్ మార్కెట్ లో మంచి వసూళ్లను అందుకునేవారు. ఇక విజయ్ కి మాత్రం ఆ క్రేజ్ చాలా ఆలస్యంగా వచ్చింది. ఇక నెక్స్ట్ ఈ దళపతి టాలీవుడ్ లో కూడా ప్రమోషన్స్ డోస్ పెంచడానికి డిసైడ్ అయ్యాడట.

    అట్లీ దర్శకత్వంలో వచ్చిన మెర్సల్, బిగిల్ సినిమాలకు తెలుగులో మంచి క్రేజ్ దక్కింది. అనంతరం సర్కార్ సినిమా కలెక్షన్స్ కూడా గట్టిగానే పెరిగాయి. నిజానికి ఆ సినిమా తెలుగు ప్రమోషన్స్ పై దర్శకులే ఎక్కువగా ఫోకస్ పెట్టారు. కానీ విజయ్ పెద్దగా పట్టించుకోలేదు. ఇక నెక్స్ట్ మాస్టర్ సినిమాను తెలుగులో భారీ స్థాయిలో విడుదల చేయాలని డిసైడ్ అయ్యారు. దర్శకుడితో పాటు విజయ్ కూడా తెలుగు ప్రమోషన్స్ లో పాల్గొనబోతున్నట్లు టాక్.

    Kollywood star Vijay biggest plan for tollywood market

    ఇప్పటికే సినిమా షూటింగ్ ఫినిష్ అయ్యింది. పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో విజయ్ కి పెద్దగా పని ఉండదని చెప్పవచ్చు. అందుకే హ్యాపీగా రిలీజ్ డేట్ అనంతరం రెండు భాషల్లో హై లెవెల్లో ప్రమోషన్స్ చేయనున్నట్లు కోలీవుడ్ మీడియాలో టాక్ వస్తోంది. ఇక మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే.. మురుగదాస్ చేయబోయే సినిమాను ద్విభాషా చిత్రంగా తెలుగులో కూడా తెరకెక్కించే ఛాన్స్ ఉందట. మురగదాస్ కి తెలుగులో కూడా మంచి మార్కెట్ ఉండడంతో విజయ్ ఎలాగైనా ఆ సినిమాను హై లెవెల్లో ప్రమోట్ చేసేందుకు డిసైడ్ అయినట్లు టాక్.

    English summary
    There are a lot of heroes in the Kollywood industry who can do hundreds of crores of business. Recently, Vijay has also surpassed the Rajinikanth market. In the past, only Rajinikanth, Kamal, Surya, Vishal and Karthi were the only ones to make good money in the Tollywood market. And for Vijay, the craze came too late. Next, the commander decided to increase the promotion dose in Tollywood as well.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X