twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Happy Birthday Vijay: 100కోట్ల రెమ్యునరేషన్.. ఫస్ట్ మూవీకి ఎంత ఇచ్చారో తెలుసా?

    |

    కోలీవుడ్ సినిమా ప్రపంచంలో అగ్ర హీరోగా తనకంటూ ఒక ప్రత్యేకమైన స్టార్ ఇమేజ్ ను సంపాదించుకున్న ఇళయ దళపతి విజయ్ తెలుగులో కూడా ఇప్పుడిప్పుడే తన మార్కెట్ స్థాయిని కూడా పెంచుకునే ప్రయత్నం చేస్తున్నాడు. ఇక నేడు విజయ్ పుట్టిన రోజు సందర్భంగా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఆయన అభిమానులు సోషల్ మీడియా ద్వారా ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇక విజయ్ సినిమా కెరీర్, అలాగే అతని ఫస్ట్ రెమ్యునరేషన్ ఎంత అనే వివరాల్లోకి వెళితే..

    మహేష్ సినిమాతో..

    మహేష్ సినిమాతో..

    విజయ్ ఎలాంటి సినిమా చేసినా కూడా బాక్సాఫీస్ వద్ద మినిమమ్ వసూళ్లను అందుకుంటున్నాయి. మొదట అతను భారీ స్థాయిలో స్టార్ డమ్ అందుకుంది మాత్రం మహేష్ సినిమాతోనే. మహేష్ ఒక్కడు సినిమాను తమిళంలో గిల్లి అనే టైటిల్ తో రీమేక్ చేసిన విజయ్ అక్కడ ఇండస్ట్రీ రికార్డును అందుకున్నాడు. రజనీకాంత్ కు అప్పట్లో 30 కోట్ల మార్కెట్ ఉండగా 2004లో ఒక్కడు రీమేక్ తో విజయ్ 50కోట్ల బాక్సాఫీస్ కలెక్షన్స్ సొంతం చేసుకున్నాడు.

    అత్యధిక రెమ్యునరేషన్

    అత్యధిక రెమ్యునరేషన్

    తమిళ చిత్ర పరిశ్రమలో రజనీకాంత్, కమల్ హాసన్ అగ్ర హీరోలుగా కొనసాగుతున్న సమయంలో వారి కంటే ఎక్కువగా క్రేజ్ అందుకున్న ఏకైక నటుడు విజయ్. అలాగే ప్రస్తుతం తమిళ చిత్ర పరిశ్రమలోనే కాకుండా ఇండియా మొత్తంలో అత్యధిక రెమ్యునరేషన్స్ అందుకుంటున్న నటులలో విజయ్ ఒకరు. ప్రస్తుతం విజయ్ 90 కోట్ల నుంచి 100కోట్ల మధ్యలో రెమ్యునరేషన్ అందుకుంటున్నట్లు తెలుస్తోంది.

    చిన్నప్పటి కష్టాలు

    చిన్నప్పటి కష్టాలు

    విజయ్ తండ్రి చంద్రశేఖర్ తమిళ పరిశ్రమలో అప్పట్లో మంచి దర్శకుడిగా క్రేజ్ అందుకున్నారు. ఇక విజయ్ తల్లి శోభ సింగర్. మొదట్లో చాలా లో మిడిల్ క్లాస్ లైఫ్ ను ఎదుర్కొన్న విజయ్ కొన్ని కష్టాలను కూడా చూశాడు. తల్లి పాటలు పాడుతూ ఉండడం వలనే మొదట్లో నిలదొక్కుకున్నారు. ఏదైనా ఒక రోజు తల్లికి పాడే అవకాశం రాకపోతే కనీసం భోజనం కూడా సరిగ్గా ఉండేది కాదట. ఆ విధంగా కూడా విజయ్ మధ్యతరగతి కష్టాలను చూశాడు.

    మొదటి రెమ్యునరేషన్

    మొదటి రెమ్యునరేషన్


    ఇక అతని మొదటి సినీ ప్రయాణం 1984లో మొదలైంది. చంద్రశేఖర్ దర్శకత్వంలో అప్పటి సూపర్ స్టార్ విజయ్ కాంత్ నటించిన వెట్రి సినిమాలో విజయ్ బాల నటుడిగా పదేళ్ల వయసులో ఎంట్రీ ఇచ్చాడు. ఆ సినిమాకు అతనికి అందిన మొదటి రెమ్యునరేషన్ 500 మాత్రమే. ఆ విధంగా అప్పటి నుంచి విజయ్ సినిమాలు చేసుకుంటూ తన డిగ్రీ దశలో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు.

    హీరోగా పనికి రాడని..

    హీరోగా పనికి రాడని..

    విజయ్ 18 ఏళ్ళ వయసులో తండ్రి దర్శకత్వంలోనే నాలయ తీర్పు అనే సినిమాలో 1990లో హీరోగా కెరీర్ ను స్టార్ట్ చేశాడు. మొదట్లో అతని హావభావాలు సరిగ్గా లేవని అతను హీరోగా పనికి రాడు అంటూ అనేక రకాల కామెంట్స్ కూడా వచ్చాయి. కానీ విజయ్ పట్టు విడవకుండా మంచి కథలతో కెరీర్ ను సరైన ట్రాక్ లోకి తీసుకు వచ్చాడు.

     బిగ్గెస్ట్ హిట్స్

    బిగ్గెస్ట్ హిట్స్

    తుపాకీ సినిమా నుంచి విజయ్ అసలైన స్టార్ హోదా మొదలైంది. అప్పటి నుంచి విజయ్ నటించిన ప్రతీ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద మినిమమ్ హిట్ గా నిలుస్తూ వస్తున్నాయి. ఇక మెర్సల్, బిగిల్ ఇలా కెరీర్ లో మరిన్ని బిగ్గెస్ట్ హిట్స్ సొంతం చేసుకున్నాడు. ప్రస్తుతం వంశీ పైడిపల్లి దర్శకత్వంలో వారసుడు అనే సినిమాతో రెడీ అవుతున్న విషయం తెలిసిందే.

    English summary
    Kollywood star Vijay birthday special first remuneration details
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X