Don't Miss!
- News కావ్య మారన్ ఆస్తులు ఎంతో తెలుసా - ఒక్కరే వారసురాలు..!!
- Sports DC vs GT: ఆ తప్పిదంతోనే ఓడిపోయాం: శుభ్‌మన్ గిల్
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Technology OPPO Find X7 Ultra కెమెరా రివ్యూ! అద్భుతమైన ఫీచర్లతో, బెస్ట్ కెమెరా ఫోన్!
- Automobiles 323 కి.మీ రేంజ్‌తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
విజయ్ సినిమా కోసం నెట్‌ఫ్లిక్స్ తీవ్ర ప్రయత్నాలు.. మరో నెల రోజులు ఓపిక పట్టాల్సిందే?
సౌత్ సినిమా ఇండస్ట్రీలో అత్యదిక ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న టాప్ హీరోలతో విజయ్ ఒకడు. దళపతి ఎలాంటి సినిమాలు చేసినా కూడా బాక్సాఫీస్ వద్ద మినిమమ్ వసూళ్లను అందుకోవడానికి రెడీగా ఉంటుంది. ఇక మాస్టర్ సినిమాపై కూడా అంచనాలు అకాశాన్ని తాకడంతో తప్పకుండా ఈ సినిమా కూడా సరికొత్త రికార్డులు క్రియేట్ చేయగలదని అంతా బావించారు. కానీ కరోనా వచ్చి దెబ్బ కొట్టింది.
సినిమా కోసం దాదాపు 180కోట్ల వరకు ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. ఎంత ఆలస్యం అయినా కూడా థియేటర్స్ లోనే రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ బలంగా ఓపికపడుతోంది. కానీ ఓటీటీ సంస్థల ప్రయత్నాలు కూడా తగ్గడం లేదు. విజయ్ లాంటి స్టార్ హీరో సినిమా చేతిలో పడింది అంటే కంపెనీ గ్రోథ్ ఒక్కసారిగా పెరిగే అవకాశం ఉంటుంది కాబట్టి మాస్టర్ కోసం హాట్ స్టార్, నెట్ ఫ్లిక్స్ పోటీ పడుతున్నట్లు టాక్ వస్తోంది.
ఇప్పటికే హాట్ స్టార్ అక్షయ్ కుమార్ లక్ష్మీ బాంబ్ సినిమాను 124కోట్లకు దక్కించుకొని సంచలనం సృష్టించింది. ఆ దెబ్బతో పెద్ద సినిమాలు భవిష్యత్తులో డైరెక్ట్ గా ఓటీటీలో రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉందని అందరికి ఒక క్లారిటీ వచ్చేసింది. ఇక విజయ్ మాస్టర్ సినిమాపై కూడా అలాంటి అంచనాలు ఏర్పడుతున్నాయి. బడ్జెట్ 180కోట్లి కాబట్టి 100కోట్లకు తగ్గినా పెద్దగా లాభం ఉండదు. శాటిలైట్ రైట్స్ అలాగే ఆడియో రైట్స్ తో ఇప్పటికే కొంత డబ్బును వెనకేసుకున్న నిర్మాతలు ఓటీటీ ద్వారా కనీసం 120కోట్లు అందుకుంటే గాని వర్కౌట్ కాదని ఫిక్స్ అయ్యారట. కానీ ఆ స్థాయిలో డీల్స్ సెట్ చేసుకుంటే మాత్రం విజయ్ రేంజ్ మరో స్థాయికి చేరుకుంటోంది.
రైట్స్ కోసం నెట్ ఫ్లీక్స్ సంస్థ గట్టిగానే పోరాడుతున్నట్లు టాక్. తమిళ్ మీడియాలో వస్తున్న కథనాల ప్రకారం వారు 90కోట్లకు డీల్ సెట్ చేసుకోవాలని ఆలోచిస్తున్నారట. కానీ అందుకు నిర్మాతలు ఇంకా ఒప్పుకోలేదని తెలుస్తోంది. మరో నెలరోజుల పాటు ఓపిక పట్టాలని అనుకుంటున్నారట. పరిస్థితులను బట్టి ఎదో ఒక నిర్ణయం తీసుకోవాలని అనుకుంటున్నట్లు టాక్.