నన్ను ఆపాలని చూస్తే.. మీ సంగతి చూస్తా.. నిర్మాతల మండలికి స్టార్ హీరో వార్నింగ్

విశాల్ గురి చి ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అచ్చ తెలుగు కుర్రాడైన విశాల్.. కోలీవుడ్‌ అగ్ర నటుల్లో ఒకరిగా గుర్తింపు తెచ్చుకున్నారు. చెల్లమే చిత్రంలో హీరోగా నటించిన ఆయనకు లింగుస్వామి దర్శకత్వంలో వచ్చిన సందైకోడి మాస్ ఇమేజ్‌ను తెచ్చిపెట్టింది. తర్వాత ఆయన చేసిన సినిమాలు వరుసగా బ్లాక్‌బస్టర్స్‌గా నిలవడంతో విశాల్ నెంబర్ గేమ్‌లో దూసుకెళ్లారు. విషయం ఏదైనా సరే ఉన్నది ఉన్నట్లుగా కుండబద్ధలు కొట్టినట్లు మాట్లాడటం ఆయన స్టైల్. ఈ క్రమంలో ఆయన కొన్ని వివాదాల్లో చిక్కుకున్నారు కూడా.

అయితే తెలుగువాడైన విశాల్.. తమిళనాట జయకేతనం ఎగురవేస్తూ ఉండటం కొంతమంది స్థానికులకు కంటగింపుగా మారింది. ఆయన స్పీడును అడ్డుకోవాలని పలుమార్లు ప్రయత్నించి విఫలమయ్యారు. విశాల్ మాత్రం ఇవేమీ పట్టించుకోకుండా ముందడుగు వేశారు. దక్షిణ భారత చలన చిత్ర నటీనటుల అసోసియేషన్ (నడిగర్ సంఘం)లో చోటు చేసుకున్న లొసుగులను ఎత్తి చూపుతూ.. విశాల్ ఆయన వర్గీయులు పోటీ చేసి విజయం సాధించారు. ఆ సమయంలో విశాల్ చేసిన విమర్శలతో తమిళ ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ తట్టుకోలేకపోయింది. ఈ పరిణామాలతో విశాల్‌ను కౌన్సిల్ నుంచి బహిష్కరించింది. అయినప్పటికీ 2017లో జరిగిన ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ఎన్నికల్లో పోటీ చేసి ప్రెసిడెంట్‌గా విజయం సాధించారు.

kollywood star vishals strong warning to the producers council here s the details

కానీ విశాల్‌ను లువురు కోలీవుడ్ సినీ పెద్దలు టార్గెట్ చేస్తూనే ఉన్నారన్న అపవాదు ఉంది. అయినప్పటికీ ఆయన ఏమాత్రం పట్టించుకోకుండా ముందుకే సాగుతున్నారు. ఒకానొక సమయంలో విశాల్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారంటూ ప్రచారం జరిగింది. తాజాగా మరోసారి తన పొలిటికల్ ఎంట్రీ, తమిళ చిత్ర పరిశ్రమలో రాజకీయాలపై ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రజలు కోరుకుంటే ఖచ్చితంగా రాజకీయాల్లోకి వచ్చి తీరాల్సిందేనని ఆయన పేర్కొన్నారు. ప్రజలకు అన్ని సౌకర్యాలు కల్పిస్తే హీరోలు ఎందుకు రాజకీయాల్లోకి వస్తారని విశాల్ ప్రశ్నించారు.

సినీ పరిశ్రమ విషయంలో ప్రభుత్వాలు జోక్యం చేసుకోకూడదని ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు. తమిళనాడులోని గత ప్రభుత్వ పెద్దలు ఏనాడూ ఇండస్ట్రీ విషయంలో జోక్యం చేసుకోలేదని.. రాష్ట్రంలో రెండు రకాల జీఎస్టీలు వసూలు చేస్తున్నారని , అసలే పరిశ్రమ కష్టాల్లో ఉందని విశాల్ ఆవ దన వ్యక్తం చేశారు. అలాగే తనతో కలిసి పనిచేసే వారు ఖచ్చితంగా నిర్మాతల మండలి అనుమతి తీసుకోవాలంటూ పలు కండీషన్లు పెట్టడంపై విశాల్ ఫైర్ అయ్యారు.

తనను సినిమాలు చేయకుండా ఎవరూ ఆపలేరని తేల్చి చెప్పారు. తమిళ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ అధ్యక్షుడిగా అందరికీ మంచే చేశానని.. నిధులను సంక్షేమం కోసమే ఉపయోగించానని విశాల్ తెలిపారు. తమిళ చిత్ర పరిశ్రమలో ఎన్నో సమస్యలు ఉన్నాయని , నిర్మాతలు తొలుత వాటి గురించి పోరాడాలని ఆయన చురకలంటించారు. ఒకవేళ తనను అడ్డుకోవాలని ప్రయత్నిస్తే నిర్మాతలమని చెప్పుకునే కొందరు ఎప్పటికీ సినిమాలు తీయలేరని విశాల్ వార్నింగ్ ఇచ్చారు. మరి ఆయన వ్యాఖ్యలపై ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి. అయితే ఈ వివాదాల కారణంగా తమ హీరో సినిమాలపై ఫోకస్ పెట్టలేకపోతున్నారని విశాల్ అభిమానులు తెగ ఫీలైపోతున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X