చావు బతుకుల్లో సీనియర్ నటుడు.. క్యాన్సర్ చికిత్సకు స్టార్ హీరోల సహాయం

కోలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో ఇప్పుడు చాలా మందిని ఒక సీనియర్ నటుడి ధీన పరిస్థితి ఎంతగానో కలచివేస్తోంది. అనారోగ్యంతో పూర్తిగా గుర్తుపట్టలేనంతగా మారిపోయిన అతన్ని చూస్తుంటే సినిమాలోని ప్రముఖులు కూడా కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. ఇక ఎలాగైనా అతన్ని ఆదుకోవాలని వారికి తోచినంత సహాయం చేయడమే కాకుండా అభిమానుల మద్దతు కూడా కోరుతున్నారు. ఇక ఆ నటుడు మరెవరో కాదు. పలు కమెడియన్ పాత్రలతో ఎక్కువగా పాపులర్ అయిన తవాసి.

స్టేజ్ 4 క్యాన్సర్ తో సీనియర్ నటుడు

స్టేజ్ 4 క్యాన్సర్ తో సీనియర్ నటుడు

తవాసి తమిళ్ పరిశ్రమలో ఒకప్పుడు మంచి మంచి పాత్రలతో జనాలకు బాగా దగ్గరయ్యాడు. అయితే గత కొంతకాలంగా తవాసి క్యాన్సర్ తో బాధపడుతున్నాడు. స్టేజ్ 4 క్యాన్సర్ తో బాధపడుతున్నట్లు తెలిపారు. ఇటీవల ఒక వీడియోను విడుదల చేసిన తవాసి ఒక స్వచ్ఛంద సంస్థ ద్వారా చికిత్స తీసుకుంటున్నట్లు చెబుతూ తన కుటుంబ ఆర్థిక పరిస్థితి ఏ మాత్రం భగలేదని ఎవరైనా సహాయం చేయాలని కోరాడు.

హీరోల ఆర్థిక సహాయం

హీరోల ఆర్థిక సహాయం

ఇక క్యాన్సర్‌తో పోరాడుతున్న నటుడు తవాసికి శివకార్తికేయన్ తక్షణమే ఆర్థిక సహాయం అందించారు. మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి, శింబు కూడా నటుడి కుటుంబానికి ఒక లక్ష రూపాయల చొప్పున అందజేశారు. ఒక్కొక్కరుగా నటుడి పరిస్థితి గురించి తెలుసుకొని స్పందిస్తున్నారు. దీంతో తమిళ జనాలు సోషల్ మీడియా ద్వారా ప్రశంసలు అందిస్తున్నారు.

 విజయ్ సేతుపతి కూడా..

విజయ్ సేతుపతి కూడా..

ఇక నటుడు విజయ్ సేతుపతి తన స్నేహితుదైన నటుడు సౌందర్ రాజా ద్వారా తవాసికి సహాయం అందించాడు. నటుడిని ప్రత్యేకంగా కలుసుకుని డబ్బును అందజేశారు. సౌందర్ రాజా కూడా తవాసికి పదివేల రూపాయలు విరాళంగా ఇచ్చి అతని ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. చాలా మంది నటులు మరియు నిర్మాతలు తవాసిని కలుసుకోవాడానికి ప్రయత్నిస్తున్నారు.

రాబోయే రోజుల్లో మరింత సహాయం: కమెడియన్ సూరి

రాబోయే రోజుల్లో మరింత సహాయం: కమెడియన్ సూరి

అతనికి సరైన చికిత్స లభించేలా ఏర్పాట్లు కూడా చేస్తున్నారు కొందరు సినీ నటులు. ఎలాగైనా క్యాన్సర్‌కు వ్యతిరేకంగా జరిగే యుద్ధంలో అతను విజయం సాధించాలని అభిమానులు కోరుకుంటున్నారు. విజయ్ సేతుపతి, శింబు, మరియు శివకార్తికేయన్ వంటి వారు మాత్రమే కాకుండా కమెడియన్ సూరి కూడా తవాసికి 20,000 రూపాయలు విరాళంగా ఇచ్చాడు. రాబోయే రోజుల్లో అతనికి మరింత సహాయం చేయడానికి ప్రయత్నిస్తానని అతను వివరణ ఇచ్చాడని తెలుస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X