twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    తమిళ రాజకీయాల్లో విజయ్ వేలు పెట్టబోతున్నాడా? వాళ్ళని దెబ్బకొట్టడానికే..?

    |

    తమిళనాడు అనగానే ఎక్కువగా గుర్తొచ్చే అక్కడి రాజకీయాలే. ఆ తరువాత అక్కడ స్టార్ హీరోలు సినిమాలతో ప్రపంచాన్ని ఆకర్షిస్తూ ఉంటారు. ఇక సినిమాలు పాలిటిక్స్ మిక్స్ అయితే అక్కడ పరిస్థితులు ఎలా ఉంటాయో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. MGR, జయలలిత, కరుణానిధి వంటి ప్రముఖులు పొలిటికల్ గా మంచి సక్సెస్ అందుకున్నారు. ఇక ఇప్పుడు రజినీకాంత్, కమల్ హాసన్ కూడా తమిళ పాలిటిక్స్ పై స్పెషల్ గా ఫోకస్ పెట్టగా మరో స్టార్ హీరో విజయ్ కూడా అక్కడి రాజకీయాల్లో వేలు పెట్టాలని డిసైడ్ అయినట్లు తెలుస్తోంది.

    ఆ విషయంలో రజినీకాంత్ కంటే ఎక్కువ?

    ఆ విషయంలో రజినీకాంత్ కంటే ఎక్కువ?


    ఇళయదళపతిగా కోలీవుడ్ ఇండస్ట్రీలో తన స్టార్ డమ్ ను అంతకంతకు పెంచుకుంటున్న విజయ్ ఒక విధంగా రజినీకాంత్ స్థాయిని కూడా మించిపోతున్నాడు. తెలుగు రాష్టాల్లో పవన్ కళ్యాణ్ కి ఎలాంటి క్రేజ్ ఉందొ తమిళ జనాల్లో విజయ్ కి కూడా అలాంటి అభిమానులే ఉన్నారు. చివరగా వచ్చిన రెండు సినిమాలు క్రియేట్ చేసిన సెన్సేషన్ తో అతనికున్న క్రేజ్ పై అందరికి ఒక అవగాహన వచ్చేసింది.

    అభిమానులని ముందే రెడీ చెసుకున్నారా..

    అభిమానులని ముందే రెడీ చెసుకున్నారా..


    అసలు మ్యాటర్ లోకి వస్తే.. పోలీటికల్ వైపు కూడా విజయ్ మెల్లగా అడుగులు వేస్తున్నట్లు ఇటీవల కోలీవుడ్ మీడియాలో టాక్ ఎక్కువగా వస్తోంది. తండ్రి చంద్రశేఖర్ కూడా విజయ్ తో ప్రత్యేకంగా పార్టీ పెట్టె విధంగా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. అలాగే అన్ని జిల్లాల్లో అభిమానుల సంఘాలను ఇప్పటికే బలంగా ఏర్పరచుకున్నట్లు సమాచారం.

    రాజకీయ ముసుగులో..

    రాజకీయ ముసుగులో..

    అప్పుడప్పుడు విజయ్ పలు గ్రామాలపై దృష్టి పెడుతూ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టే ప్రయత్నం చేస్తున్నాడు. రెగ్యులర్ గా రైతులకు కూడా సహాయంగా ఉండాలని అభిమానులను సిద్ధం చేస్తున్నారట. అయితే విజయ్ మంచి పనులు చేస్తుండడం వలన అతనిపై కావాలనే ఐటి దాడులు చేయించినట్లు కోలీవుడ్ లో టాక్ వస్తోంది. పలువురు రాజకీయ ముసుగులో విజయ్ ని టార్గెట్ చేసినట్లు టాక్ వస్తోంది.

    తన ప్రమేయంతో దెబ్బ పడేలా

    తన ప్రమేయంతో దెబ్బ పడేలా


    విజయ్ కూడా పలు సామాజిక అంశాలను లెవనెత్తుతూ గవర్నమెంట్ లోపాలను సినిమాలో చూపించే ప్రయత్నం చేస్తున్నారు. పలుమార్లు విజయ్ ఇబ్బందులు కూడా ఎదుర్కొన్నారు. అయితే వచ్చే ఎలక్షన్స్ లో ప్రత్యర్ధులకు తన ప్రమేయంతో దెబ్బ పడేలా విజయ్ రాజకీయాల్లో కీలకంగా వ్యవహరించనున్నారట.

    Recommended Video

    Happy Birthday Vijay : Thalapathy Vijay Box Office Career
     పార్టీ కూడా పెట్టనున్నారట.

    పార్టీ కూడా పెట్టనున్నారట.


    విజయ్ పార్టీ పెట్టె ఆలోచనలో ఉన్నారని కూడా రూమర్స్ గట్టిగానే వస్తున్నాయి. ఎప్పటికప్పుడు తన తండ్రి చంద్రశేఖర్ తో రాష్ట్ర రాజకీయా పరిణామాల గురించి అడిగి తెలుసుకుంటూ ప్రణాళికలు కూడా రచిస్తున్నట్లు టాక్ వస్తోంది. మరి ఇది ఎంతవరకు నిజమో తెలియాలి అంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే. నెక్స్ట్ ఈ స్టార్ హీరో మాస్టర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.

    English summary
    Tamil Nadu is one of the most memorable places in politics. Since then there have been star heroes captivating the world with movies. Needless to say, if the movies are a mix of politics, the situation there will be special. Celebrities like MGR, Jayalalithaa, Karunanidhi have received good success politically. Now that Rajinikanth and Kamal Haasan are also focusing exclusively on Tamil politics, it seems that another star hero Vijay has also decided to get involved in politics there.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X