Thalaivar 169: భయంకరమైన రక్తపు కత్తితో రజనీకాంత్ టైటిల్ పోస్టర్.. ఊచకోత గ్యారెంటీ!

సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ రజనీకాంత్ తన తదుపరి సినిమాను నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో చేయబోతున్న విషయం తెలిసిందే. గత కొంతకాలంగా వరుస అపజయాలు చూస్తున్న తలైవా ఈసారి ఎలాగైనా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకోవాలని అనుకుంటున్నాడు. ఇదివరకే నెల్సన్ దిలీప్ కుమార్ విజయ్ తో చేసిన బీస్ట్ సినిమా దారుణమైన ఫలితాన్ని అందుకుంది. ఆ సినిమా బజ్ చూసే రజనీకాంత్ ఆ దర్శకుడికి అవకాశం ఇచ్చాడు. కానీ సినిమా ఆడియెన్స్ ను ఏ మాత్రం ఆకట్టుకోలేదు.

అయితే రజనీకాంత్ నెల్సన్ సినిమా ఆగిపోయింది అనే వార్తలు ఇటీవల చాలానే వచ్చాయి. కానీ అందులో ఎలాంటి నిజం లేదని ఇప్పుడు నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ ఒక క్లారిటీ ఇచ్చేసింది. సినిమాకు సంబంధించిన అఫీషియల్ టైటిల్ పోస్టర్ ను విడుదల చేశారు. ఇక టైటిల్ ను జైలర్ గా ఫిక్స్ చేశారు. నెత్తుటితో ఉన్న కత్తి చూస్తుంటే సినిమాలో యాక్షన్ డోస్ హై లెవెల్లో ఉండే అవకాశం ఉన్నట్లు అనిపిస్తోంది. తప్పకుండా సినిమా కమర్షియల్ గా అన్ని వర్గాల ఆడియెన్స్ కు నచ్చుతుంది అని చిత్ర యూనిట్ చెబుతోంది.

kollywood supar star Rajinikanth Thalaivar 169 titled as Jailer

టైటిల్ తోనే ఎక్కువగానే ఆకట్టుకునే నెల్సన్ దిలీప్ కుమార్ ఈసారి రజనీకాంత్ ను జైలర్ గా ఎలా ప్రజెంట్ చేస్తారు అనేది కూడా హాట్ టాపిక్ గా మారింది. ఈ సినిమాకు సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా ముగిశాయి. ఇక వీలైనంత త్వరగా రెగ్యులర్ షూటింగ్ ను కూడా స్టార్ట్ చేయాలని అనుకుంటున్నారు. ఇక జైలర్ సినిమాలో రజనీకాంత్ తో మళ్ళీ చాలా కాలం తరువాత రమ్యకృష్ణ నటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అప్పట్లో నరసింహా సినిమాలో రజనీకాంత్ కు అపొజిట్ గా విలన్ పాత్రలో నటించి మెప్పించిన విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు అంతకంటే పవర్ఫుల్ పాత్రలో హైలెట్ చేయబోతున్నట్లు సమాచారం. ఇక ఈ సినిమాను వచ్చే ఏడాది సమ్మర్ కు ప్రేక్షకుల ముందుకి తీసుకు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X