'ఎందుకే రమణమ్మ పెళ్ళెందుకే రమణమ్మ తో పాపులరైన' నటి?
ఫ్రీగా పాలు దొరుకుతుంటే సొంతానికి గేదె ఎందుకు అన్నాడట వెకటికి ఒకడు. సినిమా ఇండస్ట్రీలో కొంత మంది కమెడియన్ల పరిస్థితి కూడా ఇలానే ఉంది. తెలుగు నటి కానప్పటికీ అంతటి అనుభవంతో పీల గొంతుతో తన నటనతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించే కోవై సరళకు మంచి పేరుంది. అంతటి సుపరిచయస్తురాలు. 400 చిత్రాలకు పైగా నటించారు, తెలుగుతో పాటు తమిళం, మళయాలం, కన్నడ లో ఎన్నో హాస్య పాత్రలు చేసారు. బ్రహ్మానందంతో మంచి కాంబినేషన్ అని అంటారు.
ఆమె గురించి తెలియని వారికి ఆమెది కేరళ అని చెప్పినా నమ్మనంత నేటివిటి ఉన్న నటి. అచ్చంగా ఏ విజయవాడ అమ్మాయిలానో ఉంటుంది. అలాంటి కోవై సరళ ఇప్పుడు మళ్ళీ వార్తల్లో నిలిచింది. ఇటీవల రిలీజైన 'బంపర్ ఆఫర్" చిత్రంలో 'ఎందుకే రమణమ్మ పెళ్ళెందుకే రమణమ్మ" అన్న పాటకు పాపులర్ అయ్యింది. అయితే నిజంగానే కోవై సరళకు పెళ్ళి ఇంకా కాలేదు. ఆమెకు ప్రస్తుతం 44 సంవత్సరాలు. ఇంకేం పెళ్ళి చేసుకుంటుంది. అందుకే తమిళ కమేడియన్ తో కాస్త సన్నిహితంగా ఉంటుందని సమాచారం.


Click it and Unblock the Notifications











