మణిరత్నం వల్ల నష్టపోయానంటూ నిర్మాత ఫైర్
కోవై తంబి మాట్లాడుతూ... అప్పట్లో మణిరత్నం అవకాశం కోసం తన కార్యాలయానికి వచ్చారని తెలిపారు. అప్పుడు ఇదయ కోవిల్ కథను ఇచ్చి దర్శకత్వం వహించమని చెప్పానన్నారు. సుమారు 28 ఏళ్ల తరువాత ఇప్పుడా చిత్రాన్ని మణిరత్నం విమర్శిస్తున్నారని కథ నచ్చకపోతే అప్పుడే చెప్పవచ్చు కదా, అంటూ ఆవేశంగా ప్రశ్నించారు. ఆ సమయంలో మణిరత్నం దర్శకత్వ శాఖలో శిక్షణ పొందుతున్నారని షాట్‌ను ఎలా తీయాలో కూడా అప్పుడు తెలియదని దుయ్యబట్టారు. చిత్ర షూటింగ్ కోసం సెట్ వేయడంతో డబ్బు వృథా అయ్యిందన్నారు.
అలాగే కల్యాణ మండపాలను అద్దెకు తీసి ఇచ్చానని ఆ చిత్ర సమయంలో తనకు సంగీత దర్శకుడు ఇళయరాజాకు మధ్య ఏర్పడిన మనస్పర్థలకు కూడా మణిరత్నమే కారణమని ఆరోపించారు. నిజానికి ఇదయకోవిల్ చిత్రానికి ఇళయరాజా మంచి పాటలను అందించారని తెలిపారు. 35 ఫిలిం రీల్స్ లో చిత్రాన్ని పూర్తి చేస్తానని చెప్పి 70 రోల్స్ ఖర్చు చేశారని తెలిపారు. దీంతో తనకు చాలా నష్టం ఏర్పడిందని చెప్పారు.
మణిరత్నంకు కథను తయారు చేయడం తెలియదని విమర్శించారు. ఆయన చిత్రంలో ఎంజీయార్‌ను, కరుణానిధిని అగౌరపరచేలా చూపించారని దాన్ని తాను ఖండించడం వలనే మణిరత్నం ఇలాంటి వ్యాఖ్యలు చేశారని కోవై తంబి వివరించారని ఒక తమిళ పత్రిక పేర్కొంది. మరి దీనికి మణిరత్నం కౌంటర్ ఏ విధంగా ఇస్తారో చూడాలి.
ఇదయ కోవిల్ చిత్రం 1985లో విడుదలైంది. రాధా,మోహన్, అంబిక,గౌండర్ మణి ప్రధాన పాత్రలు పోషించారు. ఇళయరాజా సంగీతం అందించారు. మణిరత్నంకు ఇది నాలుగో చిత్రం. ప్రస్తుతం మణిరత్నం తన తాజా చిత్రం కడలి షూటింగ్ లో బిజీగా ఉన్నారు. ఈ చిత్రం తర్వాత రజనీకాంత్ ని డైరక్ట్ చేయనున్నారని వార్తలు వస్తున్నాయి.


Click it and Unblock the Notifications












