పేరుకు 'కుచేలుడు'... బీమా '70 కోట్లు'

By Staff

Rajinikanth
సౌత్ సూపర్ స్టార్ రజనీకాంత్ 'కుచేలుడు' చిత్రం ఇప్పుడు మరో రికార్డును నెలకొల్పింది. పి.వాసు దర్శకుడుగా చేస్తున్న ఈ చిత్రం ట్రేడ్ లో ఇప్పటికే సంచలనం సృష్టించే విధంగా మార్కెట్ అయింది. అలాగే ఈ చిత్రాన్ని 70 కోట్ల రూపాయలకు ఇన్సూర్ చేయించి అందరినీ షాక్ చేసారు. ఇందులో తమిళ వెర్షన్ 'కుసేలన్' వాటా 40 కోట్లు కాగా, తెలుగు వెర్షన్ వాటా 30 కోట్ల రూపాయలు. ఈ ఇన్సూరెన్స్ స్కీములో ఈ సినిమాలో నటిస్తున్న రజనీకాంత్, జగపతిబాబు, నయనతార, మమతా మోహన్‌దాస్, పశుపతి వంటి తారలు, 200 మంది టెక్నీషియన్లు వున్నారు.

యాక్సిడెంట్లు, ప్రకృతి వైపరీత్యాలు వంటి వాటివల్ల నిర్మాతకు నష్టం కలగకుండా ఈ ఇన్సూరెన్స్ చేయించారు. ఒక విదేశీ కంపెనీతో కలిసి ఒక భారతీయ బీమా సంస్థ ఈ బీమా సౌకర్యాన్ని కల్పిస్తోంది. దక్షిణాదిన ఇన్సూర్ చేయించిన తొలి చిత్రం విక్రమ్ హీరోగా శంకర్ రూపొందించిన 'అన్నియన్' (తెలుగులో 'అపరిచితుడు'). అప్పట్లోనే దాన్ని 27 కోట్లకు బీమా చేయించడం వార్తల్లో నిలిచింది. అలాగే కమలహాసన్ 'దశావతారం'ను 43 కోట్లకు బీమా చేశారు. ఇక రజనీకాంత్, శంకర్ కలయికలో వస్తున్న రెండో సినిమా 'రోబో'ను మరింత ఎక్కువ మొత్తానికి బీమా చేయించవచ్చని తెలుస్తోంది. యోదైమైనా కుచేలుడు ఈ విషయంలోనూ రికార్డు సృష్టించాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X