‘గజరాజు' దర్సకుడుకి 'నాగిరెడ్డి' పురస్కారం
చెన్నై : గజరాజు (తమిళ గుమ్కి) చిత్ర దర్శకుడు ప్రభుసాల్మన్ రాష్ట్ర గవర్నరు కొణిజేటి రోశయ్య చేతుల మీదుగా నాగిరెడ్డి స్మారక పురస్కారాన్ని అందుకున్నారు. విజయ మెడికల్ ఎడ్యుకేషన్ ట్రస్టు ఆధ్వర్యంలో అలనాటి నిర్మాత నాగిరెడ్డి 100వ జయంతి సందర్భంగా ఆయన పేరిట స్మారక పురస్కారం గత ఏడాది నుంచి అందజేస్తున్న విషయం తెలిసిందే.
2012వ సంవత్సరానికి విక్రమ్‌ప్రభు హీరోగా నటించిన గజరాజు చిత్రాన్ని ఎంపిక చేశారు. ఈ అవార్డు ప్రదానోత్సవ కార్యక్రమం బుధవారం నగరంలో జరిగింది. కార్యక్రమానికి మ్యూజిక్ అకాడమీ వేదికైంది. ముఖ్య అతిథిగా హాజరైన గవర్నరు రోశయ్య ఈ ఏటి అవార్డును, రూ.1.50 లక్షల చెక్కును ప్రభుసాల్మన్‌కు అందజేశారు.
అనంతరం వారు మాట్లాడుతూ నాగిరెడ్డి బహుముఖ ప్రజ్ఞాశాలి అని, ఎంతోమంది సినీ కళాకారులను ప్రోత్సహించిన గొప్ప వ్యక్తి అని ప్రశంసించారు. అలాంటి వ్యక్తిపేరిట ఈ పురస్కారాన్ని అందజేయడం తనకు ఆనందంగా ఉందని తెలిపారు. తదనంతరం అతిథిగా పాల్గొన్న సీనియర్ గేయరచయిత వాలి ప్రసంగిస్తూ నాగిరెడ్డి నిర్మించిన 'ఎంగల్ వీట్టు పిళ్ళై', 'ఉలైప్పాళి' వంటి పలు చిత్రాలకు తాను పాటలు రాశానని, నిర్మాతగా అందరినీ ప్రోత్సహించే మనస్తత్వం ఆయనదని కొనియాడారు. ఎం.ఎస్.విశ్వనాథన్, నటి దేవయాని తదితరులు పాల్గొన్నారు.
కేరక్టర్ ఆర్టిస్టుగా అటు తమిళంతో పాటు ఇటు తెలుగు సినిమాల్లోనూ రాణిస్తున్న ప్రభు తనయుడు విక్రమ్ ప్రభు 'గజరాజు' చిత్రం ద్వారా పరిచయం సినీ రంగానికి పరిచయం అయ్యాడు. తమిళంలో విక్రమ్ ప్రభు, లక్ష్మీ మీనన్ జంటగా నటించిన 'కుమ్కి' చిత్రం తెలుగులో 'గజరాజు' పేరుతో ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్ విడుదల చేసారు. మైనా(ప్రేమ ఖైదీ) ఫేం ప్రభు సాల్మన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని తమిళంలో ఎన్.లింగుస్వామి, చంద్రబోస్‌లు నిర్మించగా బెల్లంకొండ సురేష్ అనువాద హక్కులు పొందారు.


Click it and Unblock the Notifications











