శింబు సోదరుడి మతాంతర వివాహం: రజనీకాంత్‌కు ఇన్విటేషన్!
తమిళ స్టార్ శింబు సోదరుడు, మ్యూజీషియన్ కురలరాసన్ త్వరలో ఓ ఇంటివాడు కాబోతున్నాడు. ఈ మేరకు కురలరాసన్ తన తండ్రి టి రాజేందర్‌తో కలిసి సూపర్ స్టార్ రజనీకాంత్ నివాసమైన పోయెస్ గార్డెన్‌కు వచ్చి ఇన్విటేషన్ అందజేశారు.
కురలరాసన్ మతాంతర వివాహం చేసుకోబోతున్న సంగతి తెలిసిందే. నబీలా ఆర్ అహ్మద్ అనే ముస్లిం అమ్మాయిని పెళ్లాడబోతున్నారు. వీరి వివాహం ఏప్రిల్ 29న జరుగబోతున్నట్లు తెలుస్తోంది. అదే రోజు సాయంత్రం చెన్నైలోని ఐటీసీ గ్రాండ్ చోళ హోటల్‍లో వెడ్డింగ్ రిసెప్షన్ జరుగనుంది. దీనికి తమిళ సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులంతా హాజరు కాబోతున్నారు.
కురలరాసన్, నబీలా ఆర్ అహ్మద్ కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. పెద్దలను ఒప్పించి వివాహం చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇరు వర్గాలు వీరి వివాహాం పట్ల పూర్తి సమ్మతంతో ఉండటంతో పెళ్లి వేడుక గ్రాండ్‌గా నిర్వహిస్తున్నారు.

తనకు కాబోయే భార్య కోసం కురలరాసన్ ఇటీవలే ఇస్లాం స్వీకరించారు. అతడు తీసుకున్న ఈ నిర్ణయానికి ఫ్యామిలీ మద్దతు కూడా ఉండటం గమనార్హం. 'అన్ని మతాలను గౌరవించాలనేది నా అభిమతం. నా పెద్ద కొడుకు శింబు శివ భక్తుడు, నా కూతురు అలేఖ్య క్రిస్టియన్, నా చిన్న కుమారుడు ఇస్లాంను అనుసరిస్తున్నాడు. వారి నిర్ణయాన్ని నేను గౌరవిస్తాను' అని కురలరాసన్ తండ్రి టి రాజేందర్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తెలిపారు.
కురలరాసన్ తన తండ్రి సినిమాల్లో బాలనటుడిగా చేశారు. శింబు, నయనతార మూవీ 'ఇదు నమ్మ ఆలు' సినిమాతో మ్యూజిక్ డైరెక్టర్‌గా మారాడు. అయితే ఈ చిత్రం ప్లాప్ కావడంతో మ్యూజిక్ డైరెక్టర్‌గా అతడికీ పేరు రాలేదు. కురలరాసన్ కొన్ని ఇండిపెండెంట్ ఇంగ్లిష్ ఆల్బమ్స్ చేస్తున్నాడు.


Click it and Unblock the Notifications











