పెద్ద హీరోలకు అభిమానులు రాజ పోషకులే కాక ఒక్కోసారి సెన్సార్ పాత్రను పోషిస్తారనే సంగతి చాలా సార్లు రుజువయిన విషయమే. తాజాగా రజనీ నిజజీవత పాత్రలో వచ్చిన కుసేలన్(తెలుగులో కథానాయకుడు)కు ఈ తరహా కోతలు పడుతున్నాయి. సెన్సార్ గడప దాటిన తరవాత కూడా ఈ సినిమాకు కోతలు తప్పలేదు.'కుసేలన్' లో కొన్ని సంభాషణలు తమిళ అభిమానులకు మింగుడుపడలేదు. దాంతో ఈ నిర్ణయం తీసుకోక తప్పలేదు. ముఖ్యంగా రజనీకాంత్ దగ్గర ఓ పాత్రధారి 'ఇంతకీ మీరు రాజకీయాల్లోకి వస్తారా? రారా?' అని ప్రశ్నిస్తే దానికి వివరణ ఇవ్వడం, 'మీ వయసులో సగం వయసున్న హీరోయిన్లతో నటిస్తారు కదా?' అన్నప్పుడు వివరణ ఇచ్చుకోవడం లాంటివి తమిళనాట చిన్నపాటి కలకలాన్ని రేపాయి. రజనీ ఫ్యాన్స్ తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఇప్పుడు ఆ సంభాషణలను తొలగించాలని దర్శకనిర్మాతలు నిర్ణయించుకున్నారని కోలీవుడ్ సమాచారం. అభిమానులా మజాకా ...
Story first published: Friday, May 15, 2026, 16:25 [IST]