64 కోట్లకు కుచేలుడు?

By Staff

కుచేలుడు డిస్ట్రిబ్యూషన్ హక్కులు 64 కోట్లకు అమ్ముడయ్యాయనే వార్త ఇప్పుడు తమిళ పరిశ్రమని కుదిపేస్తోంది. డిస్ట్రిబ్యూషన్ రంగంలో తనదైన శైలిలో దూసుకుపోతున్న పిరమిడ్ సాయిమీరా వారు ఈ చిత్ర తమిళ తెలుగు హక్కులు పొందారుట . పి. వాసు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో తమిళంలో పశుపతి పాత్ర తెలుగులో జగపతి బాబు చేస్తున్నారు. నయనతార, మమతా మోహన్‌దాస్ సహా పలువురు పాపులర్ తారలు ఈ చిత్రంలో నటిస్తున్నారు. దాంతో ప్రారంభం నుంచి "కుచేలుడు" సినిమా కార్పొరేట్ కంపెనీల దృష్టిని విపరీతంగా ఆకర్షిస్తోంది. అప్పటికి రజనీకాంత్ ఈ సినిమాలో తన పాత్ర కనిపించేది 25 శాతంలోనేనని స్వయంగా వెల్లడించారు. అయినా ఆ కంపెనీలు ఏమాత్రం లెక్క చేయలేదు. తెలుగు, తమిళ వెర్షన్ల పంపిణీ హక్కుల కోసం అవి పోటీ పడ్డాయి. ఆ కంపెనీల్లో యాడ్‌లాబ్స్, పిరమిడ్ సాయిమీరా థియేటర్స్ లిమిటెడ్, అయ్యంగారన్ ఫిలిమ్స్ వంటివి వున్నాయి. చివరకు పిరమిడ్ సాయిమీరా వారు విపరీతమైన పోటీలో సొంతం చేసుకున్నారు. మార్కెట్లో "కుచేలుడు" సినిమాని చాలా విలువైన ప్రొజెక్టుగా భావించటంతో ఈ రేటు పలికిందని ట్రేడ్ పండితులు భావిస్తున్నారు. అంటే కుచేలుడు మరో అరుదయిన రికార్డుని జత చేసుకున్నట్లే!

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X