హన్సికపై ఖుష్భూ కామెంట్
జూనియర్ నమిత అని కొంత మంది, యంగ్ ఖుష్బూ అని మరికొంత మంది హన్సికను అంటున్న సంగతి తెలిసిందే.బొద్దుగుమ్మగా మారిన హన్సిక రీసెంట్ చిత్రం 'వేలాయుధం'హిట్ టాక్ తెచ్చుకుంది.దాంతో అభిమానులు ఆమెకు అక్కడ ఓ గుడిని కూడా కట్టేసారు. ఇంతకుముందు కూడా ఖుష్బూకి గుడి కట్టిన తమిళ వీరాభిమానులు ఇప్పుడు హన్సికకు అక్కడ పాలాభిషేకాలు, సహస్ర నామార్చనలు చేసేస్తున్నారు. ఇక 'వేలాయుధం' చిత్రాన్ని ఖుష్బు చూసి,హన్సికపై ప్రశంసలు వర్షం కురిపించింది.
ఆమె మీడియాతో మాట్లాడుతూ..."నన్ను హన్సికతో పోల్చకండి. ఎందుకంటే నేను సినీ పరిశ్రమలోకి వచ్చిన తొలినాళ్ళల్లో నా నటన పెద్దగా ఉండేది కాదు. మొదట కొన్ని చిత్రాలతో పోలిస్తే నా కంటే హన్సిక నటనే బెటర్. ఆమె నటించింది తక్కువ సినిమాలే అయినా నటన చాలా బాగుందని''అంది.
అయితే ప్రస్తుతం హన్సిక విజయాన్ని ఆశ్వాదించే మూడ్ లో లేదు. ఆమె మాట్లాడుతూ.. ''నేను లండన్ వెళ్లి పరీక్షలు రాయాలి. బాగా రాయాలనుకుంటున్నాను. మంచి మార్కుల కోసం కష్టపడి చదువుతున్నాను. పరీక్షకు వెళ్లే ముందు సబ్జెక్టును పూర్తిగా అర్ధం చేసుకోవటానికి ప్రాధాన్యత ఇస్తాను. అందుకే ప్రస్తుతానికి పుస్తకాలపైనే నా ధ్యాసంతా''అంది. మరి 'వేలాయుధం' వేడుకల మాటేమిటి అని అడిగితే ''పరీక్షలయ్యాక పార్టీ చేసుకుంటా..అంటూ పుస్తకాల్లో మునిగిపోయింది.ఇక తెలుగులో హన్సిక నటించిన 'ఓ మై ఫ్రెండ్' చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.


Click it and Unblock the Notifications











