కాంగ్రెసు పార్టీలోనికి వీరాభిమాని ఖుష్బూ!
పెళ్లికి ముందు సెక్స్ తప్పు కాదంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన ఖుష్బూ ఈ మధ్య సంతోషంగా కనబడుతోంది. ఆ సంతోషాన్ని ఫ్యామిలీతో పంచుకోవడానికి లండన్ ట్రిప్ వేసింది. ఎందుకంత సంతోషం అంటే సుప్రీం కోర్టు ఆమెకు అండగా నిలిచి ఆమె పై ఉన్న 22 కేసులని సుప్రీంకోర్టు కొట్టివేసింది.
ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తుండగా మరో అనందకరమైన విషయం తెలిసింది. బిగ్ బి భార్యగా నటించే అవకాశం వచ్చింది. చాలా కాలం తర్వాత ఆమె నటిస్తున్న హిందీ చిత్రమిది. తండ్రీకూతుళ్ల మధ్య అనుబంధం నేపథ్యంలో ఈ చిత్రం రూపొందనుంది. దీనికి 'మేడ్ డాడీ" అన్న టైటిల్ పెట్టారు. రేవతి శర్మ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందనుంది.
ఇదిలా ఉండగా ఖుష్బూ కాంగ్రెసు పార్టీకి వీరాభిమానినని త్వరలో కాంగ్రెసు పార్టీలో చేరనుంది. కాంగ్రెసు పార్ఠీ అంటే తమ కుటుంబానికి ఎంతో గౌరవమని చిన్నప్పుడు రాజీవ్ గాంధీ ఫోటో నా గదిలో ఉండేదంటూ అభిమానాన్ని మరోసారి గుర్తుచేసుకుంది. లండన్ నుండి చెన్నై తిరిగి రాగానే రాజకీయ అరంగేట్రం గురించి మాట్లాడతానంది. ఈ సందర్భంగా తమిళనాడు కాంగ్రెసు కమిటి ప్రెసిడెంట్ టి. బాలు ఖుష్బూ అభిప్రాయానికి కతజ్ఝతలు తెలుపుతూ, ఎవరైతే మేడం సోనియా గాంథీ బాటలో నడబాలనుకుంటున్నారో వారిని తప్పకుండా ఆహ్వానిస్తాం అన్నారు.


Click it and Unblock the Notifications











