గెస్ట్ రోల్ లో... ఖుష్బూ, సదా
చెన్నై : సీనియర్ నటి ఖుష్బూ త్వరలో వెండితెరపై అతిథి పాత్రలో మెరవనుంది. ఆయన భర్త సుందర్ సి. దర్శకత్వంలోనే కనపడనుంది. ఆ చిత్రం టైటిల్ 'సమ్‌థింగ్ సమ్‌థింగ్'. సిద్ధార్థ్-హన్సిక కాంబినేషన్ లో కామెడీ చిత్రంగా రూపొందుతోంది.
దర్శకత్వానికి ఆ మధ్యన గ్యాప్ ఇచ్చి మధ్యలో హీరోగా అదృష్టాన్ని పరీక్షించుకున్నాడు సుందర్.సి. ఆయన మళ్లీ మెగాఫోన్ పట్టుకున్నాడు. విశాల్‌తో 'మదగజరాజా' తెరకెక్కిస్తున్నాడు. సిద్ధార్థ్-హన్సిక జంటగా 'సమ్‌థింగ్ సమ్‌థింగ్'ఇప్పటికే పూర్తి చేశాడు.
'సమ్‌థింగ్ సమ్‌థింగ్' ఇటీవలే ఆడియో విడుదలైంది. త్వరలోనే తెరపైకి తీసుకురానున్నారు. ఇందులో అనుకోని అతిథి తళుక్కున మెరవనున్న విషయం బయటకొచ్చింది. ఆమె మరెవరో కాదు... సీనియర్ నటి, సుందర్.సి భార్య ఖుష్బూ.
సుందర్.సి కోర్కె మేరకు ఆమె కనిపించనుందట. ఆ పాత్ర ఏమిటి, ఏ సందర్భంలో వస్తుందనే విషయాలను గోప్యంగా ఉంచాడు దర్శకుడు. ఇందులో మరో నటి సదా కూడా కనిపించనుండటం గమనార్హం. అనువాదచిత్రాల నిర్మాతగా పేరు గాంచిన శ్రీలక్ష్మీగణపతి పిక్చర్స్ సంస్థ అధినేత బి.సుబ్రహ్మణ్యం తొలి ప్రయత్నంగా ఎన్.సురేష్‌తో కలిసి నిర్మిస్తున్న స్ట్రయిట్ చిత్రమిది.


Click it and Unblock the Notifications











