20 రోజుల్లో హీరోయిన్‌ని పడేసి.. సెట్‌లోనే , డైరెక్టర్ బాగోతం బయటపెట్టిన భార్య
యువతీ , యువకుల మధ్య ప్రేమ, పెళ్లి, ఆకర్షణ అనేది సహజంగా జరిగేది. ఎవరైనా ఎప్పుడైనా ప్రేమలో పడాల్సిందే. కొందరు ప్రేమను వ్యక్తపరిస్తే, మరికొందరు గుండెల్లోనే దాచుకుంటారు. సామాన్యులే కాదు సెలబ్రెటీలు కూడా ప్రేమకు అతీతం కాదు. టాలీవుడ్ టూ బాలీవుడ్ ఏ చిత్ర పరిశ్రమ తీసుకున్నా ప్రేమ జంటలు లేకుండా ఉండదు. బ్లాక్ అండ్ వైట్ రోజుల నుంచి నేటి వరకు ఎందరో సినీ తారలు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఈ కోవలోకే వస్తారు కోలీవుడ్ సెలబ్రెటీ కపుల్ సుందర్ సి- ఖుష్బూ.
ముంబైలో ఒక ముస్లిం కుటుంబంలో జన్మించిన ఖుష్బూ బాల నటిగా కెరీర్ ప్రారంభించారు. విక్టరీ వెంకటేష్ తొలి చిత్రం కలియుగ పాండవులు సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టారు. అతి తక్కువ కాలంలోనే సౌత్‌లో స్టార్ డమ్ సంపాదించిన ఖుష్బూ దక్షిణాదిలోని అందరు అగ్ర హీరోలతో నటించారు. ఇక కోలీవుడ్‌లో ఖుష్బూకు ఉన్న పాపులారిటీ గురించి ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు. బొద్దుగా ముద్దుగా ఉండే హీరోయిన్లను ఇష్టపడే తమిళ తంబీలు ఆమెను ఎంతగానో ఆరాధించారు.

ఈ క్రమంలో ఖుష్బూ ఫ్యాన్స్ ఆమె కోసం ఏకంగా గుడి కట్టారంటే ఆమె స్టార్ డమ్, ఫ్యాన్ ఫోలోయింగ్ ఏ రేంజ్‌లో ఉందో. దీంతో తమిళనాడులో గుడి కలిగిన తొలి హీరోయిన్‌గా ఖుష్బూ రికార్డు సాధించారు. సినిమాలు చేస్తున్నా రాజకీయాలపై ఆమెకు తొలి నుంచి ఆసక్తి ఎక్కువ. పలు రాజకీయ పార్టీలలో చేరి తన గళం వినిపించిన ఖుష్బూ ఎన్నికల్లోనూ పోటీ చేసి ఓటమి పాలయ్యారు. అయినప్పటికీ రాజకీయాల్లో బ్రేక్ కోసం ఎదురుచూస్తున్నారు.
కోలీవుడ్ సీనియర్ దర్శకుడు సుందర్ సీతో ప్రేమలో పడిన ఖుష్భూ ఆయనను మతాంతర వివాహం చేసుకున్నారు. అప్పట్లో వీరి పెళ్లి ఓ సంచలనం . తమ ప్రేమ, పెళ్లి గురించి పలు ఇంటర్వ్యూలలో కీలక విషయాలు పంచుకున్నారు ఖుష్బూ . 1995లో ఖుష్బూ మాతృమామమన్ సినిమాలో లీడ్ రోల్ పోషిస్తున్నారు. ఈ సినిమాకు సుందర్ దర్శకుడు . షూటింగ్ సమయంలో ఖుష్బూని ఇష్టపడ్డ సుందర్.. ఓ రోజున ఆమె దగ్గరికి వెళ్లి నీలాంటి బిడ్డ మనకు పుడుతుందా అని అడిగాడట. బిడ్డ ఏంటీ? ఈయన అలాంటి మాటలు మాట్లాడటం ఏంటి? అని ఖుష్బూ షాకయ్యారట.
ఆ వెంటనే నన్ను పెళ్లి చేసుకోవడం నీకు ఇష్టమేనా? అని అడిగేశారట సుందర్ సి. ఆ షాక్ నుంచి తేరుకున్న ఖుష్బూ అతని ప్రపోజల్‌కు వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. ఇదంతా కేవలం 20 రోజుల షూటింగ్ సమయంలోనే జరిగిందని ఖుష్బూ తెలిపారు. అలా ఈ జంట 2000వ సంవత్సరంలో పెద్దల అంగీకారంతో ఒక్కటయ్యారు. ఈ దంపతులకు అవంతిక, అనంతిక అనే ఇద్దరు కుమార్తెలు సంతానం. పెళ్లి , పిల్లలతో కొన్నాళ్లు సినిమాలకు దూరంగా ఉన్నప్పటికీ సెకండ్ ఇన్నింగ్స్‌లో తిరిగి బిజీ అయ్యారు ఖుష్బూ. నాటి నుంచి ఎలాంటి మనస్పర్ధలు లేకుండా వైవాహిక జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్నారు ఖుష్బ- సుందర్. తన భర్త చాలా మంచివారంటూ ఎన్నో వేదికలపై చెప్పిన ఖుష్బూ.. సుందర్‌పై తనకున్న ప్రేమను చాటుకున్నారు.


Click it and Unblock the Notifications











