Kushboo: కన్న తండ్రే లైంగికంగా వేధించేవాడు.. ఏడేళ్ల తర్వాత అలా.. ఖుష్బూ సంచలన వ్యాఖ్యలు

ఒకప్పటి స్టార్ హీరోయిన్​, నటి ఖుష్బూ అంటే తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవసరం లేని పేరు. విక్టరీ వెంకటేష్​ నటించిన కలియుగ పాండవులు సినిమాతో టాలీవుడ్​కు హీరోయిన్​గా పరిచయమైన ఖుష్బూ ఆ తర్వాత కాలంలో తమిళంలో స్టార్​డమ్​ సంపాదించుకున్నారు. అనంతరం దర్శకుడు సుందర్​ను పెళ్లి చేసుకున్న ఖుష్భూ కొన్ని ఏళ్ల పాటు సినిమాలకు దూరంగా ఉండి, ప్రస్తుతం తమిళ రాజకీయాల్లో బిజీగా ఉన్నారు. అప్పుడప్పుడు పలు పాత్రలు, టీవీ షోలలో కనిపిస్తూ ఎంటర్టైన్ చేస్తున్న ఒకప్పటి స్టార్ హీరోయిన్ ఖుష్బూ తన తండ్రిపై షాకింగ్ కామెంట్స్ చేశారు. తనను లైంగికంగా వేధించేవాడని విస్తుపోయే నిజాలు చెప్పుకొచ్చారు.

ముస్లిం కుటుంబంలో..

ముస్లిం కుటుంబంలో..

ముస్లిం కుటుంబంలో జన్మించిన ఖుష్బూ బాల నటిగా సినిమాల్లో కెరీర్ ప్రారంభించారు. ఫ్యామీలీ హీరో, విక్టరీ వెంకటేష్​తో జోడీ కట్టిన ముద్దుగుమ్మ ఖుష్బూ కలియుగ పాండవులు సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి రంగప్రవేశం చేశారు. అతి తక్కువ కాలంలో స్టార్​ హీరోయిన్​గా చక్రం తిప్పిన ఖష్బూ మెగాస్టార్ చిరంజీవి, కింగ్ నాగార్జున వంటి తదితర స్టార్​ హీరోలతో జత కట్టి ఆడిపాడారు. తెలుగులోను ఒక స్పెషల్​ ఇమేజ్​ను క్రియేట్ చేసుకుని సత్తా చాటారు ఖుష్బూ. ఇలా వరుస సిమాలు చేస్తూ అతి తక్కువ కాలంలోనే దక్షిణాదిలో స్టార్​ హీరోయిన్​గా ఒక వెలుగు వెలిగారు.

ఎలక్షన్స్​లో ఓటమి..

ఎలక్షన్స్​లో ఓటమి..

ఇంకా కోలీవుడ్ లో ఖుష్బూకు ఉన్న పాపులారిటీ గురించి ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు. ఆమెను ఎంతగానో ఆరాధించే ఖుష్బూ ఫ్యాన్స్ ఆమె కోసం ఏకంగా గుడి కట్టారంటే ఆమె స్టార్ డమ్, ఫ్యాన్ ఫోలోయింగ్ ఏ రేంజ్ లో ఉందో. దీంతో తమిళనాడులో గుడి కలిగిన తొలి హీరోయిన్​గా బ్యూటిఫుల్ ఖుష్బూ రికార్డు సాధించారు. సినిమాల తర్వాత తమిళనాడు అసెంబ్లీ ఎలక్షన్స్​లో పోటీ చేసి ఓడిపోయిన ఖుష్బూ సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్​గా ఉంటారు.

జాతీయ మహిళ కమిషన్ సభ్యురాలిగా..

జాతీయ మహిళ కమిషన్ సభ్యురాలిగా..

ఓవైపు రాజకీయాలు, అప్పడప్పుడు బుల్లితెర, వెండితెరపై కనువిందు చేస్తున్న ఖుష్బూ సోషల్ మీడియా ద్వారా సామాజిక అంశాలపై, ప్రభుత్వ విధానాలపై మాట్లాడుతుంటారు. అనేక ఘటనలు, అంశాలపై తన గొంతు వినిపిస్తుంటారు. తనకు తప్పు అనిపించిన విషయాలను సూటిగా విమర్షిస్తుంటారు. ప్రస్తుతం బీజేపీ పార్టీలో కొనసాగుతున్న ఖుష్బూకి ఇటీవల జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలి పదవి దక్కింది. ఈ నేపథ్యంలో తన తండ్రిపై ఖుష్బూ చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ అయ్యాయి.

 కన్న తండ్రే లైంగిక దాడి..

కన్న తండ్రే లైంగిక దాడి..


ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఖుష్బూ దేశంలో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలపై మాట్లాడారు. మహిళలు ఎదుర్కొంటున్న లైంగిక వేధింపుల గురించి ఆమె చెప్పుకొచ్చారు. తన కన్నతండ్రే తనపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఖుష్బూ చెప్పడం సినీ లోకాన్ని షాక్ కు గురిచేసింది. ప్రస్తుతం ఈ వార్త సెన్సేషనల్ గా మారింది. తన తండ్రి తనపై 8 ఏళ్ల వయసులోనే తనపై లైంగిక దాడికి పాల్పడినట్లు ఖుష్బూ చెప్పడం విస్మయానికి గురి చేసింది.

15 ఏళ్లు వచ్చేసరికి..

15 ఏళ్లు వచ్చేసరికి..

"చిన్న పిల్లలపై లైంగిక దాడి జరిగినప్పుడు ఆ బాధ వారి జీవితాంతం వెంటాడుతుంటుంది. అది వారి జీవితంలో ఒక మచ్చగా మిగిలిపోతుంది. పెళ్లి అయినప్పటి నుంచి నా తండ్రి నా తల్లిని దారుణంగా కొట్టేవాడు. మమ్మల్ని కూడా కొట్టేవాడు. 8 ఏళ్ల వయసులోనే నా తండ్రి చేతుల్లో లైంగిక వేధింపులకు గురయ్యాను. 15 ఏళ్లు వచ్చేసరికి ఎదురు మాట్లాడే ధైర్యం వచ్చింది. ఈ విషయం మా అమ్మకు కూడా ఇప్పటి వరకు చెప్పలేదు. ఇప్పుడు చెప్పిన నమ్మదు" అని తన బాధను వ్యక్తం చేశారు ఖుష్బూ. అంటే తన కన్నతండ్రి చేతుల్లో ఏడేళ్ల పాటు లైంగిక దాడి పాల్పడటాన్ని ఖుష్బూ ఎదుర్కున్నారు. ఏడేళ్ల తర్వాత ఎదురిచారని అర్థం అవుతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X