ఇంతకంటే మంచి సినిమా ఉంటుందా.. ‘మాస్టర్’పై కుష్బూ కామెంట్స్
చాలా రోజులు తరువాత థియేటర్ల వద్ద పండుగ వాతావరణం కనిపిస్తోంది. గతేడాది మొత్తం అందరూ ఇంట్లోనే ఉంటు టీవీల్లో, ఓటీటీల్లో సినిమాలను చూస్తు గడిపారు. కానీ ప్రస్తుతం సాధారణ పరిస్థితి నెలకొంది. ఈ క్రమంలో సంక్రాంతి బరిలోకి దిగిన చిత్రాలు సత్తాను చాటాయి. టాలీవుడ్, కోలీవుడ్‌లో సంక్రాంతి చిత్రాలు దుమ్ములేపుతున్నాయి. థియేటర్ల వద్ద కోలహలం కనిపిస్తోంది. రికార్డ్ కలెక్షన్లతో బాక్సాఫీస్‌లు కళకళలాడుతున్నాయి.
అయితే కోలీవుడ్‌లో విజయ్ నటించిన మాస్టర్ ప్రభంజనం నడుస్తోంది. డివైడ్ టాక్ వచ్చినా యావరేజ్ డిజాస్టర్ అంటూ ఎంత ట్రోలింగ్ నడిచినా కూడా కోలీవుడ్‌లో మాస్టర్ సినిమా రికార్డ్ కలెక్షన్లతో దూసుకుపోతోంది. ఇక తెలుగులో అయితే ఇది నాసిరకం సినిమా అంటూ తీసిపారేశారు. కానీ కలెక్షన్లు మాత్రం బాగానే వస్తున్నాయని తెలుస్తోంది. సంక్రాంతి సీజన్ వల్ల అది సాధ్యమై ఉంటుందని అంటున్నారు.

అయితే తాజాగా కుష్బూ మాస్టర్ సినిమాను చూస్తున్నాను అని చెప్పింది. దాదాపు పది నెలల తరువాత మళ్లీ థియేటర్లోకి వచ్చాను అది కూడా దళపతి విజయ్ మాస్టర్ సినిమా కంటే బెటర్ సినిమా ఇంకేది ఉంటుందని చెప్పుకొచ్చింది. విజయ్, విజయ్ సేతుపతి, లోకేష్ కనకరాజ్ అదరగొట్టేశారు.. అనిరుధ్ సంగీతం అవుట్ స్టాండింగ్ అంటూ పొగిడేసింది. మొత్తానికి కోలీవుడ్‌లో సంక్రాంతి విన్నర్‌గా మాస్టర్ నిలిచాడు.


Click it and Unblock the Notifications











