రిలీజ్ కాలేదు కానీ...ఫేమస్ అయ్యింది
చెన్నై : తెరపైకి రాకముందే తన ప్రత్యేకతను చాటుకుంటోంది 'కుట్రం కడిదల్'. ఈ చిత్రం ద్వారా బ్రహ్మ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. జేఎస్‌కే ఫిలిమ్ కార్పొరేషన్ బ్యానరుపై సతీష్‌కుమార్ నిర్మిస్తున్న ఈ సినిమా ఇప్పటికే జింబాబ్వే, ముంబయి చిత్రోత్సవాలు, ఇండియన్ పనోరమ.. వంటి పలు వేదికలపై అవకాశం దక్కించుకుంది.
పలువురు ప్రముఖులు అభినందించారు. బెంగళూరులో జరుగనున్న 7వ అంతర్జాతీయ చలనచిత్రోత్సవాలకు కూడా తాజాగా ఎంపికైంది. దీనిపై సతీష్‌కుమార్ మాట్లాడుతూ.. ''ఈ కథ విన్నప్పటినుంచే నాకు సంతోషంగా ఉంది. సినిమా పూర్తయ్యాక.. ప్రతిక్షణం ఆనందాన్ని పంచుతోంది.

ఒక్కో మెట్టూ ఎక్కుతూ సినీ ప్రముఖులను ఆకట్టుకుంటోంది. ఇలాంటి సినిమాను నిర్మించినందుకు గర్వంగా ఉంది. మరిన్ని తీయాలనే ఉత్సాహానిస్తోంది. గతంలో తెరకెక్కించిన 'తంగమీన్గల్' కూడా పలు అవార్డులను సొంతం చేసుకుంది. తాజాగా పుదుచ్చేరి ప్రభుత్వ పురస్కారాన్ని కూడా దక్కిడం ఆనందంగా ఉంద''ని పేర్కొన్నారు.


Click it and Unblock the Notifications











