మరో క్రేజీ ప్రాజెక్టుతో విజయేంద్ర ప్రసాద్.. అక్కడ కూడా సత్తా చాటేందుకు..

గత కొద్దికాలంగా ప్రముఖ మాటల రచయిత కేవీ విజయేంద్ర ప్రసాద్ తెలుగు, తమిళం, హిందీ భాషల్లో సత్తా చాటుతున్నాడు. బాహుబలి సిరీస్‌తో ప్రపంచానికి తెలుగు సత్తా ఏమిటో చూపించారు. అంతేకాకుండా ఆయన అందించిన కథతో వచ్చిన భజ్‌రంగీ భాయ్‌జాన్, మెర్సల్ లాంటి చిత్రాలు కాసులు వర్షం కురిపించాయి. తాజాగా తన పెన్ పవర్ చూపించడానికి ఇప్పుడు మలయాళ పరిశ్రమలో అడుగుపెట్టాడు.

తాజా సమాచారం ప్రకారం.. మలయాళంలో చారిత్రాత్మక నేపథ్యంతో తెరకెక్కే ఓ భారీ బడ్జెట్ చిత్రానికి స్క్రిప్టు అందిస్తున్నారు. ఈ చిత్రానికి విశ్వగురు ఫేమ్, గిన్నిస్ బుక్ రికార్డు విజేత విజీష్ మణి దర్శకత్వం వహిస్తున్నారు. విశ్వగురు సినిమాను కేవలం 51 గంటల రెండు నిమిషాల్లో పూర్తి చేశారు. సెప్టెంబర్‌లో ఈ చిత్రం సెట్స్‌పైకి వెళ్తుంది.

KV Vijayendra Prasad entry into mollywood

ప్రస్తుతం మలయాళ సినిమాతోపాటు RRR సినిమాకు కథను,మాటలను అందిస్తున్నారు. బాహుబలితో అంతర్జాతీయ ఖ్యాతిని అందించిన ఎస్ఎస్ రాజమౌళి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండగా, జూనియర్ ఎన్టీఆర్, ఆలియా భట్, అజయ్ దేవగన్ తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రం జూలై 30, 2020 రోజున విడుదల కానున్నది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X