For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సీక్రెట్ గా లేడి కమెడియన్ విద్యుల్లేఖ ఎంగేజ్మెంట్.. వరుడు ఎవరో తెలుసా?

    |

    లాక్ డౌన్ సినిమా ఇండస్ట్రీలో ఒక్కొక్కరికి ఒక్కో విధంగా ఉపయోగపడింది. నిత్యం సినిమాలతో బిజీగా ఉండే నటీనటులకు కొంత గ్యాప్ రావడంతో ఎంతగానో మార్పులు తీసుకువచ్చిందనే చెప్పాలి. ఒక విధంగా వారికి హాలిడేస్ అనే కాకుండా భవిష్యత్తు కెరీర్ ప్లాన్ కోసం కూడా ఉపయోగపడింది. కొందరైతే కొన్ని టార్గెట్స్ సెట్ చేసుకున్నారు. ఇక ఫిట్నెస్ విషయంలో కూడా భారీ మార్పులే తీసుకొచ్చారు. అలాంటి వారిలో ఎక్కువగా షాకిచ్చింది మాత్రం లేడి కమెడియన్ విద్యుల్లేఖ అనే చెప్పాలి. లాక్‌డౌన్‌లో ఆమె బరువును చాలానే కరిగించినట్లు తెలుస్తోంది. అదే విదంగా పెళ్లి కోవడానికి కూడా ఆమె సిద్ధమైంది.

    Malli Malli Chusa Movie Public Talk | Anurag Konidena | Shweta Avasthi
    పెళ్లి చేసుకోబోతున్న విద్యుల్లేఖ

    పెళ్లి చేసుకోబోతున్న విద్యుల్లేఖ

    విద్యుల్లేఖ అనగానే సౌత్ ఆడియెన్స్ కి ఆమె చేసిన కామెడీ పాత్రలు చాలానే గుర్తొస్తాయి. సీనియర్ తమిళ టెలివిజన్ నటుడైన మోహన్ రామన్ కుతురే ఈ విద్యుల్లేఖ. ఇక ఆమె లుక్ తోనే వెండితెరపై ఆడియెన్స్ నవ్వించే ప్రయత్నం చేస్తుంది. ఇక ఇప్పుడు ఆమె పెళ్లి వార్తతో మీడియాలో స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచారు. కొన్ని రోజుల క్రితమే ఎవరు ఊహించని విధంగా చాలా బరువు తగ్గింది.

    ప్రియుడితో ఎంగేజ్మెంట్

    ప్రియుడితో ఎంగేజ్మెంట్

    ఒక విధంగా విద్యుల్లేఖ నేటితరం యంగ్ హీరోయిన్స్ కి చాలెంజ్ విసిరిందనే చెప్పాలి. అదే విధంగా చాలా స్లిమ్ గా మారి నెటీజన్స్ కి షాకిచ్చిందనే చెప్పాలి. ఆమె గత కొంత కాలంగా ఒక ఫిట్నెస్ అండ్ న్యూట్రిషన్ నిపుణుదైన సంజయ్‌తో ప్రేమలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇటీవల వీరి నిశ్చితార్థం కూడా జరిగింది.

    క్లారిటీ ఇచ్చిన నటి

    క్లారిటీ ఇచ్చిన నటి

    మొదట్లో విద్యుల్లేఖ పెళ్లిపై తమిళ మీడియాలో అనేక రకాల రూమర్స్ వచ్చాయి. అందులో కొంత కన్ఫ్యూజన్ నెలకొనగా ఎట్టకేలకు ఆమెనే సోషల్ మీడియా ద్వారా క్లారిటీ ఇచ్చింది.

    ఆగస్టు 26 న నిశ్చితార్థం జరిగినట్లు చెబుతూ.. ఎక్కువగా కన్ఫ్యూజన్ కాకముందే ఈ విషయాన్ని చెబుతున్నాను అంటూ వివరణ ఇచ్చారు. ఈ వేడుకకు సన్నిహితులు, కుటుంబ సభ్యులు మాత్రమే హాజరయ్యారు.

    పెళ్లి ఎప్పుడంటే..

    పెళ్లి ఎప్పుడంటే..

    వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి అన్ని ప్రభుత్వ మార్గదర్శకాలను అనుసరించి ఈ కార్యక్రమంను నిర్వహించినట్లు ఈ లేడి కమెడియన్ తెలిపింది. ఇక నవంబర్ అనంతరం ఆమె పెళ్లి జరగనున్నట్లు ఇన్ సైడ్ టాక్. విద్యుల్లేఖ తమిళ్ నటి అయినప్పటికీ ఎక్కువగా టాలీవుడ్ సినిమాలతోనే బిజీ అవుతోంది. సరైనోడు, రాజుగారి గది వంటి సినిమాల్లో విద్యుల్లేఖ చేసిన పాత్రలు మంచి గుర్తింపుని తెచ్చిపెట్టాయి. దీంతో 2018 నుంచి ఏ మాత్రం గ్యాప్ ఇవ్వకుండా తెలుగు సినిమాలు చేస్తోంది.

    English summary
    It must be said that the lock down has brought a new kind of change for busy actors. Something big has changed in terms of fitness. The most shocked of them is the Lady Comedian vidyullekha. She seems to have dissolved most of her weight on lockdown.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X