Don't Miss!
- News కాంగ్రెస్ ఖమ్మం సీటు పంచాయితీలో అనూహ్య మలుపు..!!
- Technology జియో సినిమా యాప్‌లో IPL మ్యాచ్‌లను ఉచితంగా చూస్తున్నారా.. రేపు కీలక ప్రకటన??
- Sports ఆ రూల్ వల్లే గెలిచాం- KL రాహుల్
- Automobiles క్రాష్ టెస్ట్‌లో హోండా అమేజ్‌కు గట్టి షాక్.. ఆ విభాగంలో ‘0' రేటింగ్.!!
- Lifestyle ఈ 4 రాశుల వారు ఉత్తమ సెక్స్ భాగస్వాములు అవుతారు... వీరిని లైఫ్ పార్ట్నర్ గా పొందడం అదృష్టం!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
సీక్రెట్ గా లేడి కమెడియన్ విద్యుల్లేఖ ఎంగేజ్మెంట్.. వరుడు ఎవరో తెలుసా?
లాక్ డౌన్ సినిమా ఇండస్ట్రీలో ఒక్కొక్కరికి ఒక్కో విధంగా ఉపయోగపడింది. నిత్యం సినిమాలతో బిజీగా ఉండే నటీనటులకు కొంత గ్యాప్ రావడంతో ఎంతగానో మార్పులు తీసుకువచ్చిందనే చెప్పాలి. ఒక విధంగా వారికి హాలిడేస్ అనే కాకుండా భవిష్యత్తు కెరీర్ ప్లాన్ కోసం కూడా ఉపయోగపడింది. కొందరైతే కొన్ని టార్గెట్స్ సెట్ చేసుకున్నారు. ఇక ఫిట్నెస్ విషయంలో కూడా భారీ మార్పులే తీసుకొచ్చారు. అలాంటి వారిలో ఎక్కువగా షాకిచ్చింది మాత్రం లేడి కమెడియన్ విద్యుల్లేఖ అనే చెప్పాలి. లాక్డౌన్లో ఆమె బరువును చాలానే కరిగించినట్లు తెలుస్తోంది. అదే విదంగా పెళ్లి కోవడానికి కూడా ఆమె సిద్ధమైంది.
Recommended Video
పెళ్లి చేసుకోబోతున్న విద్యుల్లేఖ
విద్యుల్లేఖ అనగానే సౌత్ ఆడియెన్స్ కి ఆమె చేసిన కామెడీ పాత్రలు చాలానే గుర్తొస్తాయి. సీనియర్ తమిళ టెలివిజన్ నటుడైన మోహన్ రామన్ కుతురే ఈ విద్యుల్లేఖ. ఇక ఆమె లుక్ తోనే వెండితెరపై ఆడియెన్స్ నవ్వించే ప్రయత్నం చేస్తుంది. ఇక ఇప్పుడు ఆమె పెళ్లి వార్తతో మీడియాలో స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచారు. కొన్ని రోజుల క్రితమే ఎవరు ఊహించని విధంగా చాలా బరువు తగ్గింది.
ప్రియుడితో ఎంగేజ్మెంట్
ఒక విధంగా విద్యుల్లేఖ నేటితరం యంగ్ హీరోయిన్స్ కి చాలెంజ్ విసిరిందనే చెప్పాలి. అదే విధంగా చాలా స్లిమ్ గా మారి నెటీజన్స్ కి షాకిచ్చిందనే చెప్పాలి. ఆమె గత కొంత కాలంగా ఒక ఫిట్నెస్ అండ్ న్యూట్రిషన్ నిపుణుదైన సంజయ్‌తో ప్రేమలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇటీవల వీరి నిశ్చితార్థం కూడా జరిగింది.
క్లారిటీ ఇచ్చిన నటి
మొదట్లో విద్యుల్లేఖ పెళ్లిపై తమిళ మీడియాలో అనేక రకాల రూమర్స్ వచ్చాయి. అందులో కొంత కన్ఫ్యూజన్ నెలకొనగా ఎట్టకేలకు ఆమెనే సోషల్ మీడియా ద్వారా క్లారిటీ ఇచ్చింది.
ఆగస్టు 26 న నిశ్చితార్థం జరిగినట్లు చెబుతూ.. ఎక్కువగా కన్ఫ్యూజన్ కాకముందే ఈ విషయాన్ని చెబుతున్నాను అంటూ వివరణ ఇచ్చారు. ఈ వేడుకకు సన్నిహితులు, కుటుంబ సభ్యులు మాత్రమే హాజరయ్యారు.
పెళ్లి ఎప్పుడంటే..
వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి అన్ని ప్రభుత్వ మార్గదర్శకాలను అనుసరించి ఈ కార్యక్రమంను నిర్వహించినట్లు ఈ లేడి కమెడియన్ తెలిపింది. ఇక నవంబర్ అనంతరం ఆమె పెళ్లి జరగనున్నట్లు ఇన్ సైడ్ టాక్. విద్యుల్లేఖ తమిళ్ నటి అయినప్పటికీ ఎక్కువగా టాలీవుడ్ సినిమాలతోనే బిజీ అవుతోంది. సరైనోడు, రాజుగారి గది వంటి సినిమాల్లో విద్యుల్లేఖ చేసిన పాత్రలు మంచి గుర్తింపుని తెచ్చిపెట్టాయి. దీంతో 2018 నుంచి ఏ మాత్రం గ్యాప్ ఇవ్వకుండా తెలుగు సినిమాలు చేస్తోంది.