»   » లక్ష్మీ మీనన్ బాత్రూం వీడియో...పోలీస్ కంప్లైంట్

లక్ష్మీ మీనన్ బాత్రూం వీడియో...పోలీస్ కంప్లైంట్

Posted By:
Subscribe to Filmibeat Telugu

చెన్నై : తమిళ చిత్ర పరిశ్రమలో వరస చిత్రాలతో సక్సెస్ సాధిస్తున్న భామ లక్ష్మీ మీనన్. ఆమె తాజాగా బూతు వీడియోల బారిన పడింది. ఆమె ఫొటోని మార్పింగ్ చేసి ఓ వీడియోని లక్ష్మీ మీనన్ బాత్రూం పేరుతో వదిలారు. ఈ విషయం తెలుసుకున్న నెట్ జనలు ఆ వీడియో కోసం వెతకటం మొదలెట్టారు. ఈ సంగతి లక్ష్మీ మీనన్ కు తెలిసింది.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

దాంతో ఆమె వెంటనే సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించింది. దాంతో వారు రంగంలోకి దిగి ఆ వీడియోని డిలేట్ చేసారు. అంతేకాకుండా ఆ వీడియోని ఎవరైతే అప్ లోడ్ చేసారో వారి ని ట్రేస్ అవుట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. అయితే అప్పటికే వాట్సప్ ద్వారా ఆ వీడియో షేర్ అయ్యి...డౌన్ లోడ్ లు జరిగాయని సమాచారం.

Lakshmi Menon is the new victim of morphing

ఇక ఈ విషయమై లక్ష్మి మీనన్ మాట్లాడుతూ అది ఫేక్ వీడియో అని, అది కేవలం మార్ఫింగ్ చేసిందే అని వివరణ ఇచ్చారు. అలాంటి వీడియోలు అప్ లోడ్ చేయటం పద్దతి కాదని ఆమె కోపంతో అన్నారు.

ఇక ఆమె వ్యక్తిగత, ప్రొఫెషనల్ జీవితం విషయానికి వస్తే..

కుంకీ చిత్రంతో తమిళ తెరకు పరిచయమైన ఈ బ్యూటీ ఇటీవల విడుదలైన మంజా పై వరకు అన్ని చిత్రాలు విజయం కావడంతో యమా జ్యోష్ మీదుందీ బ్యూటీ. ఇదిలా ఉంటే ఈ సుందరి పాండియనాడు, నాన్ సిగప్పు మనిదన్ వంటి చిత్రాలలో విశాల్ సరసన నటించిన ఆయనతో ప్రేమలో పడిందనే వార్తలు వెల్లడి కావడంతో ఈ బ్యూటీ కాస్త వెనక్కు తగ్గి విశాల్ తో నటించేందుకు వచ్చిన మూడో ఛాన్స్‌ను నిరాకరించినట్లు సమాచారం. దీంతో ఆ అవకాశం కాజల్ అగర్వాల్‌కు దక్కినట్టు తెలుస్తోంది.

ఈ బ్యూటీ కార్తీతో నటించిన కొంభన్ చిత్రం త్వరలో తెరపైకి రావడానికి సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. ఈ స్థితిలో లక్ష్మీమీనన్ ఒక టీవీ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తాను ఖచ్చితంగా ప్రేమ వివాహమే చేసుకుంటానని తెలిపిందట. అంతేకాకుండా ఆ వ్యక్తి సినీ రంగానికి చెందిన వారు కాదని తేల్చి చెప్పిందట. అయినా కొందరు మాత్రం ఆమెపై వచ్చే రూమర్స్‌ను అడ్డుకునేందుకే అలా చెప్పి ఉంటుందని అంటున్నారు. ఏదేమైనా లక్ష్మీకు కాస్త డేర్ ఎక్కువే అంటున్నాయి కోలీవుడ్ వర్గాలు.

దక్షిణాది హీరోయిన్‌లు అందరూ తల్లిదండ్రుల చూసిన అబ్బాయినే పెళ్లి చేసుకుంటానని అంటుంటారు. ప్రేమ వివాహం చేసుకుంటున్నప్పటికీ తమది పెద్దలు కుదిర్చిన పెళ్లే అని నమ్మించేందుకు యత్నిస్తుంటారు. అయితే లక్ష్మీ మీనన్ మాత్రం ధైర్యంగా తాను ప్రేమ వివాహమే చేసుకుంటానని తెగేసి చెబుతోంది.

English summary
Lakshmi Menon is the latest victim of image morphing. A video of a bathing scene is doing the rounds on social media and whatsapp in the actress' name. The video, which is apparently shot using a mobile camera, shows a woman who resembles the actress.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu