గ్లామర్‌గా నటించే ఆలోచన లేదు..అందుకే చదువు

By Srikanya

చెన్నై : 'సుందరపాండియన్‌', 'గుమ్కీ'(తెలుగు గజరాజు) లతో మోస్ట్ వాంటెడ్‌ హీరోయిన్ గా మారింది లక్ష్మీమీనన్‌. అయితే ఎంత బిజీగా ఉన్నా చదువుకు తాను ఇచ్చే ప్రాధాన్యత ఇస్తానని చెప్తోంది. సినిమాల కోసం చదువును వదులుకోలేనని, చదువును ఎట్టి పరిస్ధితుల్లోనూ ఆపనంటోంది. టెన్త్ క్లాస్ పూర్తి చేసిన ఈమె త్వరలో ప్లస్ వన్ లో జాయిన్ అవుతోంది. 'సుందరపాండియన్‌' (తెలుగులో రీమేక్ అవుతోంది) అనంతరం శశికుమార్‌ సరసన 'కుట్టిపులి'లో హీరోయిన్ గా నటిస్తోంది.

లక్ష్మీమీనన్‌ మాట్లాడుతూ... గతంలో హీరోయిన్స్ కు చాలా సంవత్సరాల పాటు అవకాశాలు వచ్చేవి. ఇప్పుడు అలాంటి పరిస్థితిలేదు. అందులోనూ నాకు గ్లామర్‌గా నటించే ఆలోచన లేదు. ఇప్పుడున్న రెండు సినిమాల తర్వాత అవకాశం రాకపోతే నేనేం చెయ్యాలి? అందుకే చదువుపై శ్రద్ధ పెడుతున్నా. పదోతరగతి పూర్తిచేసి ప్లస్‌వన్‌లో చేరబోతున్నా. ఎట్టిపరిస్థితుల్లోనూ చదువు ఆపను అంది. అలాగే ఒకవేళ స్టార్ హీరోయిన్ గా మారితే అని ప్రశ్నిస్తున్నారు. అలాగైనా ఎన్నేళ్లపాటు ఉండగలం? ఆ తర్వాతైనా వేరే వృత్తి తప్పదుగా అని చెప్పింది.

ఇటీవల శివాజీగణేశన్ మనుమడు నటించిన గజరాజు చిత్రంలో హీరోయిన్ లక్ష్మీమీనన్. లక్కీ హ్యాండ్‌గా అందరూ ఆమెను భావిస్తున్నారు. చేసింది రెండు చిత్రాలైనా విజయవంతం కావడంతో ఈ అమ్మడికి బ్రహ్మరథం పడుతున్నారు తమిళనాడులో. అయితే పొగడ్తలతోపాటు తెగడ్తలు కూడా ఆమెకెదురవుతున్నాయట. రెండు చిత్రాలతోనే లక్ష్మీమీనన్‌కు పొగరు ఎక్కిందనీ, ఏమాట పడితే ఆ మాట మాట్లాడుతోందని ఆమెపై పుకార్లు షికార్లు చేశాయి కోలీవుడ్‌లో. ముఖ్యంగా అజిత్, విజయ్ లాంటి అగ్రహీరోల సరసన తాను నటించనని ఆమె అన్నట్లుగా ప్రచారం జరిగింది.

వారి పక్కన తాను నటిస్తే హీరోయిన్‌గా పెద్ద వయసు ఉన్నదానిగా ప్రేక్షకులు భావిస్తారని, అందుకే యువ హీరోల సరసనే తాను నటిస్తానన్న కథనాలు పత్రికల్లో వచ్చాయి. ఈ విషయంపై లక్ష్మీమీనన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎవరైనా సరే కొత్తగా వచ్చిన హీరోయిన్ అజిత్, విజయ్ సరసన నటించడానికి ఉవ్విళ్లూరుతారు కానీ, నటించనని అంటారా? అని తన వాదన వినిపిస్తోంది. ఇదంతా చూస్తుంటే చేసింది రెండు చిత్రాలతోనే ఇంత విజయాన్ని అందుకున్నానని, తనపై కుట్ర చేస్తున్నారని చెప్పుకొచ్చింది. ఏది ఏమైనా మన హద్దుల్లో మనం వుండడమే మంచిదన్న మాట కూడా చెప్పింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X