twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మకాం మార్చిన మలయాళి భామ

    By Srikanya
    |

    చెన్నై : హీరోయిన్ లక్ష్మీమీనన్‌ తన మకాం చెన్నైకు మార్చేసింది. తమిళ పరిశ్రమలో కొన్నేళ్లుగా మలయాళ భామల హవా ఎక్కువైంది. ఈ క్రమంలో ప్రభు నట వారసుడు విక్రమ్‌ప్రభు హీరోగా పరిచయమైన 'గుమ్కీ'కి లక్ష్మీమీనన్‌ అనే కొత్త తారను ఎంపిక చేశారు.

    ఆ సమయంలో 9వ తరగతి విద్యార్థిని అయిన లక్ష్మీమీనన్‌ నటన ఎంతో పరిణితితో ఉందని దర్శకుడు ప్రభుసాల్మన్‌ కితాబిచ్చాడు. అనంతరం నటుడు శశికుమార్‌ 'సుందరపాండియన్‌'లో అవకాశమిచ్చాడు. ఇవి రెండూ ఘన విజయాలు సాధించటంతో శశికుమార్‌ తన కొత్త చిత్రం 'కుట్టిపులి'లో కూడా ఆమెనే హీరోయిన్ గా తీసుకున్నాడు. ఈ చిత్రం శుక్రవారం విడుదల కానుంది.

    ప్రస్తుతం లక్ష్మి మీనన్ చేతిలో 'మంజప్పైస', 'సిప్పాయ్‌', పాండియనాడు'తో పాటు సమారు అరడజను చిత్రాలు ఉన్నాయి. 'కుట్టిపులి'కి ముందు పదో తరగతి పరీక్షలు రాసేందుకు వెళ్లిన లక్ష్మీమీనన్‌ పైచదువుల కోసం తిరిగి సొంత వూరుకు వెళ్లనున్నట్లు తెలిపింది.

    వరుస విజయాలు, అవకాశాలతో మనసు మార్చుకుంది. ప్రస్తుతానికి సినిమాలకే ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయించుకుంది. కేరళ నుంచి చెన్నైకు చక్కర్లు కొట్టటం ఎందుకని ఏకంగా ఇక్కడికే మకాం మార్చింది. అవకాశాలు జోరు కొనసాగినంత కాలం ఇక్కడే ఉంటానని చెబుతోంది.

    English summary
    Lakshmi Menon is an Indian film actress mainly appears in Tamil films along with few Malayalam films. She made her acting debut in Malayalam with Raghuvinte Swantham Raziya (2011) and debuted in Tamil as female lead with Sundarapandian, which emerged a commercial success.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X