»   » భయపడిపోయి లక్ష్మీరాయ్...కేకలు...రక్షించారు

భయపడిపోయి లక్ష్మీరాయ్...కేకలు...రక్షించారు

By Srikanya
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  చెన్నై : బాలకృష్ణ అథినాయుకుడులో కనిపించి అలరించిన లక్ష్మిరాయ్..రీసెంట్ గా అభిమానులు తాకిడికి అల్లాడిపోయింది. 'ఒన్బదుల గురు' అనే తమిళ సినిమా చిత్రీకరణ ఇటీవల పుదుచ్చేరిలో జరిగింది. బోట్‌హౌస్‌ ప్రాంతంలో వేసిన ప్రత్యేక సెట్‌లో వినయ్‌, లక్ష్మీరాయ్‌పై కొన్ని సన్నివేశాలను చిత్రీకరించారు. విషయం తెలుసుకున్న అభిమానులు లక్ష్మీరాయ్‌ను చూసేందుకు వందల సంఖ్యలో వచ్చారు. కాసేపటికే ఆమెను చుట్టుముట్టారు. వారి మధ్య లక్ష్మీరాయ్‌ చిక్కుకుపోయింది. దీంతో బెంబేలెత్తిన ఆమె కేకలు వేయడంతో చిత్రయూనిట్‌ రక్షించి కారులో పంపించేసింది. చిత్రీకరణ తాత్కాలికంగా ఆగిపోయింది.

  సరైన హిట్లు లేకపోయినా.. వార్తల్లో నిలిచే కథానాయికల వరసలో లక్ష్మీరాయ్‌ అగ్రస్థానంలో ఉంటుందనే చెప్పొచ్చు. ప్రస్తుతం అమ్మడు తమిళంలో మూడు చిత్రాల్లో నటిస్తోంది. అర్జున్‌ హీరోగా నటిస్తున్న ఓ చిత్రంలో కథానాయికగా ఎంపికైంది. మరోవైపు వినయ్‌ హీరోగా వస్తున్న 'ఒన్బదుల గురు'లోనూ హీరోయిన్‌ ఆమే. దీనికి పీటీ సెల్వకుమార్‌ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇందులో ప్రేమ్‌జీ, అరవింద్‌, సత్యన్‌ తదితరులు నటిస్తున్నారు.

  లక్ష్మిరాయ్ 'అధినాయకుడు" చిత్రంలో బాలకృష్ణతో రొమాన్స్ చేసినా వర్కవుట్ కాకపోవటంతో తెలుగులో ఆమె నిలుదొక్కుకునే ఛాన్స్ పోయినట్లైంది. ఈ సినిమాల తర్వాత హాలీవుడ్ సనిమాల్లో అవకాశ సంపాదించే దిశగా ప్రయత్నాలు మొదలు పెట్టింది లక్ష్మి. ఈ నేపథ్యంలో కొందరు కొంటె మీడియా ప్రతినిధులు హాలీవుడ్‌లో నటించాలంటే న్యూడ్‌గా కూడా నటించాల్సి వస్తుంది కదా? అని లక్ష్మీరాయ్‌ని ప్రశ్నిస్తే ' హాలీవుడ్ సినిమాల్లో న్యూడిటీ తప్పేం కాదు. అదక్కడ జస్ట్ గ్లామర్ మాత్రమే. నా అభిమాన దర్శకుడైన జేమ్స్ కేమరూన్ దర్శకత్వంలో హాలీవుడ్‌లో నటించే అవకాశం వస్తే న్యూడ్‌గా నటించడానికి కూడా నేను సిద్ధంగానే వున్నాను" అని చెప్పుకొచ్చింది.

  English summary
  Lakshmi Rai was at the receiving end of some fan frenzy at the shooting of her upcoming flick, 'Onbadula Guru', in Puducherry.
 A huge crowd gathered in the morning, waving to Lakshmi Rai and taking her autograph while shooting proceeded smoothly . The trouble started around 4 pm when a huge group of college students reached the spot. In a while, the crowd went crazy, with youngsters mobbing Lakshmi, reaching out to touch her.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more