పత్రికపై లక్ష్మీరాయ్ కేసు...హైకోర్టు 'స్టే'
వివరాల్లోకి వెళితే... తాజాగా వెలువడిన సంచికలో 'ఒకే గదిలో కథానాయకుడితో బస చేస్తే తప్పా' అనే శీర్షికన కథనం ప్రచురించింది.ఇది తన కీర్తి ప్రతిష్ఠలకు భంగం వాటిల్లేలా ఉందని, ప్రచురణకర్తలు క్షమాపణ చెప్పడమేకాక, రూ.30 లక్షలు పరిహారం కింద చెల్లించాలని లక్ష్మీరాయ్ సివిల్ సూట్ దాఖలు చేశారు. విచారణకు స్వీకరించిన హైకోర్టు న్యాయమూర్తి ఆర్.సుధాకర్ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు.
సినీ పరిశ్రమలోకి వచ్చి చాలా కాలమే అయినా...ఇప్పటి వరకు సరైన బ్రేక్ రాలేదు హీరోయిన్ లక్ష్మిరాయ్ కి. అందుకే పరిశ్రమలో నిలదొక్కుకోవడానికి ఎక్స్‌పోజింగ్ విషయంలో సైతం బెట్టు చేయకుండా అందాల ఆరబోత విషయంలో లిమిట్లేమీ పెట్టకుండా దర్శకులు హీరోలకు ఫుల్లుగా సహకరిస్తోంది. అయినా ఫలితం ఉండటం లేదు. ఆమధ్యన లక్ష్మిరాయ్ చేసిన 'అధినాయకుడు" చిత్రం సైతం భాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టడంతో తెలుగులో ఆమెను పిలిచే వారే కరవయ్యారు.


Click it and Unblock the Notifications












