సంక్రాంతికి ఆ సినిమా లేనట్లే!.. దయచూపని తలైవా

సూపర్ స్టార్ రజినీకాంత్ ఏడు పదుల వయసు దగ్గరపడుతున్న సమయంలో వరుసగా మూడు సినిమాలను ఎనౌన్స్ చేసి అభిమానులకు మంచి కిక్కయితే ఇచ్చాడు గాని. ఆ సినిమాలు ఎప్పుడు వస్తాయో ఊహించడమే కష్టంగా ఉంది. భవిష్యత్తు ప్రాజెక్టుల విషయాన్ని పక్కన పెడితే ఆల్ మోస్ట్ ఫినిష్ కావాల్సిన అన్నాతై ఇప్పుడు అనుకున్న సమయానికి వస్తుందా లేదా అనేది హాట్ టాపిక్ గా మారింది.

ఎందుకంటే రజినీకాంత్ ఇప్పట్లో షూటింగ్స్ చేయడానికి ఏ మాత్రం రెడీగా లేడట. కరోనా వైరస్ ప్రస్తుతం తమిళనాడులో ఊహించని విధంగా పెరిగిపోతోంది. ముఖ్యంగా చెన్నైలో ప్రతిరోజూ కూడా మరణాల సంఖ్య అంతకంతకు పెరిగిపోతోంది. అందుకే ఎవరు కూడా షూటింగ్స్ చేయడానికి ధైర్యం చేయడం లేదు.

Latest update on rajanikanth siva movie shooting update

ఇక రజినీకాంత్ ఆరోగ్య పరిస్థితిని బట్టి ఇలాంటి సమయంలో ఎంత మాత్రం రిస్క్ చేయవద్దని పర్సనల్ డాక్టర్లు కూడా చెప్పారట. దీంతో తలైవా మరో ఆరు నెలల వరకు షూటింగ్స్ కి బ్రేక్ ఇవ్వాలని డిసైస్ అయ్యారట. ఆ ఆరు నెలల తరువాత కూడా పూర్తిగా కరోనా అదుపులోకి వస్తేనే బయట అడుగు పెట్టాలని ఒక నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం.

అయితే ఇటీవల అన్నతై దర్శకుడు శివ రజినీకాంత్ ని ఒక 24రోజుల డేట్స్ మాత్రమే అడిగారట. కట్టుదిట్టమైన ప్రొటెక్షన్ తో షూటింగ్ చేస్తామని చెప్పినప్పటికీ తలైవా ఒప్పుకోలేదని సమాచారం. ఒకవేళ రజినీ ఒప్పుకున్నా కూడా ఆయన కుటుంబ సభ్యులు ఒప్పుకునే పరిస్థితుల్లో లేరట. దీంతో జనవరి లో రిలీజ్ కావాల్సిన అన్నాతై సినిమా మరింత ఆలస్యంగా రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉన్నట్లు సమాచారం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X