Don't Miss!
- News కాకినాడలో పవన్ పై జగన్ విమర్శల్లో తడబాటు..! పాలకొల్లులో పోటీ, నాలుగో సీటు...
- Finance Mutual Funds: ఆ కంపెనీల్లో వాటాను పెంచుకున్న మ్యూచువల్ ఫండ్స్..
- Sports IPL చరిత్రలో తొలిసారి.. రాహుల్-రుతురాజ్కు షాక్!
- Travel శ్రీవారి భక్తులకు శుభవార్త.. ఐఆర్సిటిసి తిరుమల టూర్ ప్యాకేజీ...
- Automobiles కనీవినీ ఎరుగని డిస్కౌంట్స్!.. హ్యుందాయ్ కారు కొనటానికి ఇదే మంచి సమయం
- Technology ధర రూ.14999 కే 6000mAh బ్యాటరీ, 50MP కెమెరా శాంసంగ్ స్మార్ట్ఫోన్ కొత్త వేరియంట్ విడుదల..!!
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
స్టార్ దర్శకుడికి తొలగిన అడ్డంకులు.. మొదలుకానున్న బిగ్ బడ్జెట్ మూవీ
ఇండియన్ సినిమా హిస్టారిలో సరికొత్త సినిమాలతో రికార్డులు క్రియేట్ చేసిన దర్శకుడు శంకర్. ఆయన సినిమాలో కేవలం కమర్షియల్ అంశాలే కాకుండా సమాజానికి ఉపయోగపడే ఒక మంచి సందేశం కూడా ఉంటుంది. గతంలో ఎన్నో డిఫరెంట్ సినిమాలతో బాక్సాఫీస్ వద్ద రికార్డుల క్రియేట్ చేసిన శంకర్ రోబో అనంతరం మళ్ళీ తన స్థాయికి తగ్గట్టుగా విజయాలను అందుకోలేదు. ఐ, 2.ఓ సినిమాలు అంచనాలను ఏ మాత్రం అందుకోలేకపోయాయి.
ఇక ఎంతో ప్రతిష్టాత్మకంగా మొదలుపెట్టిన ఇండియన్ 2 సినిమాతో అయినా సక్సెస్ కొట్టాలని అనుకున్న శంకర్ కు కెరీర్ లో మొదటిసారి భారీ దెబ్బ పడింది. ఆ సినిమాను ఏ సమయాన స్టార్ట్ చేశారో గాని మొదటి నుంచి కూడా అనేక రకాల అడ్డంకులు వస్తున్నాయి. షూటింగ్ లో జరిగిన ప్రమాదమే భారీగా దెబ్బ కొట్టింది. యూనిట్ సభ్యులు కొందరు ప్రాణలు కోల్పోవడమే కోలుకోలేని దెబ్బ. ఇక ఆ తరువాత కరోనా వేటుకు మరికొన్నాళ్లు అగాల్సి వచ్చింది. అందరూ షూటింగ్స్ స్టార్ట్ చేస్తున్న సమయంలో ఇండియన్ 2 షూటింగ్ ను కూడా స్టార్ట్ చేయాలని అనుకున్నాడు శంకర్.
కానీ అప్పుడు నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్ బడ్జెట్ విషయంలో అభ్యంతరం చెప్పడంతో శంకర్ కు కోపం వచ్చింది. వెయిటింగ్ లిస్ట్ లో పెట్టడంతో మరో సినిమాను స్టార్ట్ చేసుకుంటున్నాను అంటూ శంకర్ తెగేసి చెప్పారని కూడా టాక్ వచ్చింది. ఇక ఇప్పుడు ఫైనల్ గా ఇరువురి మధ్య ఆ చర్చ ఏకాభిప్రాయానికి వచ్చినట్లు తెలుస్తోంది. అంతా సర్దుకోవడంతో సినిమాను ఫిబ్రవరి ఏండింగ్ లోనే మొదలు పెట్టాలని డిసైడ్ అయ్యారట. ఇదే నెలలో స్టార్ట్ చేయాలని శంకర్ భావించినప్పటికీ కమల్ హాసన్ విక్రమ్ అనే మరో సినిమాను పూర్తి చేయాలని టార్గెట్ పెట్టుకోవడంతో ఫిబ్రవరికి షెడ్యూల్ ని ఫిక్స్ చేసినట్లు సమాచారం.